ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. ప్రపంచ దేశాలు ఎంత వ్యతిరేకించినా రష్యా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటివరకూ 3500 మంది రష్యన్ సైనికులను ఉక్రెయిన్ బలగాలు మట్టుబెట్టాయని ఆ దేశ అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. మరో 200 మంది రష్యా సైనికులు పట్టుబడ్డారని తెలిపింది.
ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ లో పెద్ద సంఖ్యలో సైనిక స్థావరాలను ధ్వంసం చేయడంతోపాటు సైనిక బలగాలను రాజధాని కీవ్ లోకి ప్రవేశింపచేసింది. రష్యా సైనికులతో ఉక్రెయిన్ బలగాలు పోరాడుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని తెలుస్తోంది. ఉక్రెయిన్ లో మరణాలు, ఆర్థిక నష్టం తీవ్రత పెరుగుతున్నదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటివరకూ మొత్తం 3500 మంది రష్యన్ సైనికులను ఉక్రెయిన్ బలగాలు మట్టుబెట్టాయని ఆ దేశ అధ్యక్ష కార్యాలయ అధికారి పేర్కొన్నారు. మరో 200 మంది రష్యా సైనికులు పట్టుబట్టారని తెలిపారు.
ఉక్రెయిన్ పై దాడికి దిగిన రష్యాకు కూడా భారీ నష్టమే జరిగిందని తెలుస్తోంది. ఇప్పటివరకూ సుమారు 3500 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ బలగాలు తమ ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు. అలాగే మరో 200 మంది రష్యాసైనికులను బంధించినట్టు తెలిపింది. దీనికి తోడు 14 విమానాలను, 8 హెలిక్యాప్టర్లను, 102 యుద్ధ ట్యాంక్ లను కూడా రష్యా కోల్పోయినట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది.
రష్యా సైనిక చర్యకు ఉక్రెయిన్ ఎదురొడ్డి నిలుస్తున్నదనీ.. తగిన విధంగా రష్యాకు జవాబు చెబుతున్నదని ఉక్రెయిన్ అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఇక ఉక్రెయిన్ పై రష్యా మిస్సైళ్ల వర్షం కురుస్తోంది. అనేకప్రాంతాల్లో వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం ఉక్రెయిన్ దాడిపై స్పందించిన రష్యా.. ఇప్పటివరకూ ఉక్రెయిన్ లోని 118 సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. వాటిలో 11 మిలిటరీ ఎయిర్ ఫీల్డ్స్, 13 కమాండ్ పోస్ట్ లు, ఉక్రేనియన్ సాయుధ దళాల కమ్యూనికేషన్ సెంటర్లు, 14 ఎస్300, ఓసా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థలు, 36 రాడార్ స్టేషన్లు ఉన్నాయని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ కు చెందిన ఐదు యుద్ధవిమానాలు, ఒక హెలిక్యాప్టర్, ఐదు డ్రోన్ లు కూల్చేశామని.. డజన్ల కొద్దీ వాహనాలు ధ్వంసమయ్యాయని పేర్కొంది.