ఉక్రెయిన్ పై దాడి చేస్తున్న రష్యాను కట్టడి చేసేందుకు ఈయూ దేశాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కఠిన ఆంక్షలు పెట్టిన అమెరికా మరో భారీ ప్రణాళికను రచిస్తోంది. రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేలా వ్యూహం పన్నుతోంది. అమెరికా విధించిన కొన్ని ఆంక్షలతో రష్యాకు నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే దానికి సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపే కమ్యూనిస్టు దేశాన్ని ఫైనాన్సియల్ గా దెబ్బకొట్టాలని అమెరికా యోచిస్తోంది. ఈమేరకు ‘స్విప్ట్’ ప్రయోగాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు స్విప్ట్ అంటే ఏమిటి..? దీనికి రష్యాకు ఉన్న సంబంధం ఏంటి..?
అంతర్జాతీయంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థల మధ్య కీలకమైన సమాచారాన్ని సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్సిషనల్ టెలి కమ్యూనికేషన్స్ (స్విప్ట్) పనిచేస్తుంది. స్విప్ట్ ఫ్రధాన కార్యాలయం బెల్జియంలో ఉంది. కొన్ని దేశాలు భారీ చెల్లింపులను దీని ద్వారా చేసుకుంటాయి. పూర్తిగా భద్రతా భావంతో ఆయా దేశాలకు అనుగుణంగా స్విప్ట్ ఫనిచేస్తుంది. 1970లో స్విప్ట్ ప్రారంభమైంది.ఇందులో కొన్ని వేల దేశాల నుంచి భాగస్వాములుగా ఉన్నారు. సహకార విధానంతో సభ్యులకు నాణ్యమైన సేవలను అందిస్తుంది స్విప్ట్. ప్రస్తుతం రోజుకు 4.20 కోట్ల సందేశాలు స్విప్ట్ ద్వారా వెళ్తున్నాయి. 2020లో రోజువారీ సగటు 3.80 కోట్ల సందేశాలు వెళ్లాయి.
స్విప్ట్ లో రష్యా దేశం కూడా భాగస్వామిగా ఉంది. ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితుల దృష్టా ఆ దేశాన్ని ఇందులో నుంచి తొలగిస్తే రష్యాకు బుద్ది చెప్పినట్లవుతుందని యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు అంటున్నాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం సంయమనం పాటించాలని అంటున్నాయి. రష్యాపై నిషేధం విదిస్తే అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీసినట్లవుతుందంటున్నారు. దీని వల్ల ఆర్థిక వ్యవస్థలు ఒడిదుడుకులను గురవుతాయని డచ్ ప్రధాన మంత్రి మార్క్ రూత్ అన్నారు. రష్యాను స్విప్ట్ నుంచి తక్షణమే బహిష్కరించాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ జీ 7 దేశాల సమావేశంలో అన్నారు.
అయితే స్విప్ట్ నుంచి రష్యాను నిషేధిస్తే ఏంజరుగుతుంది..? అంటే..స్విప్ట్ నుంచి రష్యాను తొలగించడం ద్వారా ఆర్థిక సేవల సమాచారం పొందదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి ఆ దేశం దూరంగా ఉంటుంది. దీని వల్ల అంతర్జాతీయ వాణిజ్యాభివృద్ధికి ఆటంకం కలుగుతుంది అని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. అమెరికా డాలర్ స్టానంలో ప్రత్యర్థులు సమాచార వ్యవస్థను రూపొందించుకుంటారని తెలుపుతున్నారు. రష్యన్లు వారి కంపెనీలు దిగుమతులకు నగదు చెల్లింపులను సకాలంలో చెల్లించలేరు. అలాగే ఎగుమతులకు సంబంధించిన సొమ్మును అందుకోలేరు. రష్యా నుంచివిదేశాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉండదు. ఆ దేశానికి చెందిన వారు ఎటువంటి సమాచారం కోసమైనా ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుంది.
ఈయూ నిబంధనలకు లోబడే స్విప్ట్ పనిచేస్తుంది. ఇరాన్ అణు కార్యక్రమ నేపథ్యంలో 2012లో ఆ దేశానికి చెందిన సంస్థలు కేంద్ర బ్యాంకుతో పాటు ఇతర ఆర్థిక సంస్థలు స్విప్ట్ సేవలు వినియోగించకుండా ఈయూ దేశాలు నిషేధించాయి. ఈ క్రమంలో రష్యాను కూడా పక్కనబెడితే ఆ దేశానికి సరుకులు ఎగుమతి నగదు పొందడానికి కష్టంగా మారుతుందని ఈయూ భావిస్తోంది. అయితే ఈయూ స్విప్ట్ ద్వారా రష్యాను కట్టడి చేయనుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. కానీ రష్యాను తొలగించడం ద్వారా ప్రపంచ వాణిజ్యంపై దెబ్బ పడే అవకాశం ఉన్నందున వెనుకాముందు ఆలోచించాల్సి వస్తోందని తెలుస్తోంది.