స్విమ్మింగ్ లో స్వర్ణ పతక విజేత రెయాన్ లోచెట్ - గ్రెగ్ రూథర్ పర్డ్ - మరో ఇద్దరు ఆస్ట్రేలియన్ రోయింగ్ కోచ్ లు.. ఇలా చెప్పుకుంటూపోతే రియోలో నిలువుదోపిడీకి గురైన బాదితుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ప్రపంచంలోని అతిపెద్ద క్రీడా సంబరమైన ఒలింపిక్స్ ను నిర్వహిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న బ్రెజిల్.. మరోవైపు అదే ఒలింపిక్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా అప్రదిష్టను మూటగట్టుకుంటోంది. క్రీడాకారులకు హోటల్లు - కండోంలు.. పర్యాటకులకు వేశ్యలను సిద్ధం చేయడంలో చూపించిన శ్రద్ధ, ఆసక్తులను క్రీడాకారులకు రక్షణ కల్పించడంతో బ్రెజిల్ చూపించలేకపోయిందని ప్రపంచవ్యాప్తంగా మీడియాలో విమర్శల వర్షం కురుస్తుంది. స్పోర్ట్స్ విలేజ్ - స్టేడియాల నుంచి బయటకు రావాలంటే క్రీడాకారులు భయపడుతున్నారని చెబుతున్నారంటే... అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్ధంచేసుకోవచ్చు.
స్విమ్మింగ్ లో స్వర్ణ పతక విజేత రెయాన్ లోచెట్ ని తుపాకి గురిపెట్టి దోచుకున్న ఘటన మరువకముందే లాంగ్ జంప్ లో బ్రిటన్ కు కాంస్య పతకం సాధించిపెట్టిన గ్రెగ్ రూథర్ పర్డ్ ను కత్తితో బెదిరించి ఆ పతకంతోపాటు ఖరీదైన ఫోన్ ను కూడా లాక్కునిపోయారు దొంగలు. ఈ సంఘటనలతో పాటు మరో ఘటనలో ఇద్దరు ఆస్ట్రేలియన్ రోయింగ్ కోచ్ లను నిలువు దోపిడీకి గురయ్యారు. ఇవి రియోలో జరుగుతున్న నిలువు దోపిడీలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఒంటరిగా బయటకు వెళ్లవద్దని - అత్యవసరమనుకుంటే వాహనాల్లోనే వెళ్లాలని కొన్ని దేశాలు వారి వారి క్రీడాకారులకు హెచ్చరించేవరకూ వెళ్లాయంటే రియోలో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఒలింపిక్స్ కోసం సుమారు 85 వేలమంది భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. దొంగతనాల బారి నుంచి మాత్రం క్రీడాకారులను రక్షించలేకపోతున్నారు. ఇది కచ్చితంగా బ్రెజిల్ ప్రభుత్వ వైఫల్యమేనని పలువురు క్రీడాకారులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. వేల కిలోమీటర్లు వచ్చి - ఎంతో కష్టపడి సంపాదించుకున్న పతకాలను సైతం పోగొట్టుకోవాల్సి రావడంపై క్రీడాకారులు నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు దొంగతనాలతోపాటు అసాంఘిక కార్యకలాపాలు కూడా బ్రెజిల్ లో రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఒలింపిక్స్ నిర్వహణతో ప్రపంచం దృష్టిని ఆకర్షించి మార్కులు కొట్టేయాలని భావించిన బ్రెజిల్ పరువు రియో వేదికగా పూర్తిస్థాయిలో పోగొట్టుకుంటుందనే విషయం మరిచిపోతుందనే విమర్శలు మొదలయ్యాయి.