చిత్తూరుకు చెందిన దళిత న్యాయమూర్తి ఎస్ రామకృష్ణ అధికార పార్టీ, ఏపీ హైకోర్టు మాజీ జడ్జి ఈశ్వరయ్యపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా సంచలనం సృష్టించిన మొద్దు శీను హత్య కేసును రీ-ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు తమ కోర్టు ముందుకు వచ్చినప్పుడు ఈ కేసులో జస్టిస్ ఈశ్వరయ్య పాత్రపై తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. ఆ సమయంలో ఈశ్వరయ్య జిల్లా న్యాయమూర్తిని కలవడం అనేక సందేహాలకు దారితీసింది. కేసును తప్పుదోవ పట్టించేందుకు నాడు హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఈశ్వరయ్య అనంత జిల్లా జడ్జిని కలిశారని ఆరోపిస్తున్నారు. ఈ కేసును ప్రభావితం చేశారని అనుమానిస్తున్నారు.
మొద్దు శీను అసలు జైలు ప్రాంగణంలో హత్యకు గురికాలేదని రామకృష్ణ ఆరోపిస్తున్నారు. అతనిని బయట హత్య చేశారని, ఆ తర్వాత మృతదేహాన్ని జైలు బ్యారాక్‌లోకి తీసుకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని తాను తన రిపోర్టులోను పేర్కొన్నానని చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఓంప్రకాశ్ ఈ హత్యకు కారణం కాదని, అదే విషయాన్ని అతను విలపిస్తూ చెప్పిన సందర్భాలు ఉన్నాయన్నారు. అదే తాను రిపోర్టులో పేర్కొన్నానన్నారు.
కాగా, జస్టిస్ ఈశ్వరయ్య ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. సంచలనాత్మక కేసుల్లో తీర్పులను ప్రభావితం చేయడంలో అతని పాత్రపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, రామకృష్ణకు ఎనిమిదేళ్లుగా పోస్టింగ్ లేదు. జస్టిస్ పైన అభిశంసన ప్రక్రియకు ఫిర్యాదు చేసి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత వివిధ కారణాలతో సస్పెండ్ అయ్యారు.