ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే ఆలయాల్లో ఒకటైన శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి సంబంధించిన కీలక మార్పు ఒకటి చోటు చేసుకుంది. ఏడాదిలో పరిమిత రోజుల్లో మాత్రమే భక్తుల్ని అనుమతించే ఈ ఆలయాన్ని ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ మంది భక్తులు సందర్శించే ఆలయంగా దీన్ని చెప్పొచ్చు. దేశ.. విదేశాల నుంచి ఈ ఆలయాన్ని సందర్శించేందుకు వ్యయ.. ప్రయాసలకు గురైనా.. స్వామి వారి దర్శనం కోసం వెనక్కి తగ్గరు.
తాజాగా ఈ ఆలయానికి సంబంధించిన ఒక కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ఇంతకాలంగా ఉన్న ఈ ఆలయం పేరును మారుస్తూ ఆలయ బోర్డు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ‘‘శబరిమల శ్రీ ధర్మ శాస్త్ర ఆలయం’’ అన్న పేరుతో వ్యవహరించేవారు. ఇటీవల తీసుకున్న నిర్ణయంతో ఈ ఆలయాన్ని ఇప్పుడు ‘‘శబరిమల శ్రీ అయ్యప్పస్వామి ఆలయం’’గా మారుస్తూ నిర్ణయంతీసుకున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఆలయన పాలక మండలి అయిన ట్రావన్ కోర్ దేవస్థానం బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.
దేవస్థానం బోర్డు పరిధిలో ధర్మశాస్త్ర ఆలయాలు చాలానే ఉన్నా.. అయ్యప్పస్వామికి ప్రపంచంలో ఉన్న ఏకైక ఆలయం శబరిమల మాత్రమే.. అందుకే ఈ ఆలయం పేరును మార్చాలని..ఆలయం పేరులో ప్రత్యేకంగా ఉండాలన్న ఉద్దేశంతో దీని పేరును మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయ్యప్ప స్వామి భక్తులు తాము ఎంతగానో అభిమానించే స్వామి వారి ఆలయం పేరు మారిందన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/