భీమిలిలో సబ్బం జాడ ఎక్కడ కన్పించడం లేదే.?

Update: 2019-03-28 06:44 GMT
పాపం సబ్బం హరి. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేత. మంచి ఫాలోయింగ్ కూడా ఉండేది. కానీ అనవసర తప్పిదాల వల్ల క్రేజ్‌ మొత్తం పోగొట్టుకుని ఇప్పుడు సాధారణ లీడర్‌ లా మారిపోయాడు. వైఎస్‌ ఉన్నప్పుడే ఎంపీగా ఉన్న సబ్బం హరి.. రాష్ట్ర విభజన తర్వాత కిరణ్‌ కుమార్‌ రెడ్డి పెట్టిన పార్టీలో చేరాడు. ఆ పార్టీని కాస్తా ప్రజలు చీకొట్టే సరికి.. ఒంటిరి వాడైపోయాడు. గత ఆరు నెలల నుంచి చంద్రబాబుని పొగిడి.. ఎలాగొలా టీడీపీలో చేరాడు. భీమిలి టిక్కెట్‌ సంపాదించుకున్నాడు.

భీమిలి టిక్కెట్‌ అయితే వచ్చింది కానీ ఆ నియోజకవర్గంలో సబ్బం సందడి ఏం కన్పించడం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత నియోజక వర్గంలో బాగా కన్పిస్తోంది. దీంతోపాటు తనకంటూ సొంత కేడర్‌ అనేది ఏమీ లేకపోవడంతో.. సబ్బం ప్రస్తుతం భీమిలి నియోజకవర్గంలో ఒంటిరివాడు అయిపోయాడు. దీనికితోడు అవంతి శ్రీనివాస్‌ లాంటి ఉద్ధండుడ్ని ఢీకొట్టి ఎదురొడ్డి నిలబడ్డం సబ్బం వల్లే అయ్యే పనేనా అని అంటుకుంటున్నారు స్థానికులు. ఆర్థికంగా బలమైన నేతగా ముద్రపడిన అవంతిని తట్టుకుని గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఇక ప్రచారంలో కూడా అవంతి శ్రీనివాస్‌ దూసుకుపోతుంటే సబ్బం చాలా వెనకపడిపోయారు. అందులోనూ వైసీపీ వైవ్‌ బాగా ఉన్నటైమ్‌ లో సబ్బం భీమిలిలో గెలుపొందడం అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకుల అంచనా.

    

Tags:    

Similar News