బాబు ప్లాన్ కు సబ్బం హరి విలవిల..

Update: 2019-03-21 01:30 GMT
భీమిలి కథ కంచికి చేరింది. టీడీపీ నుంచి మాజీ అనకాపల్లి ఎంపీ సబ్బం హరికి చంద్రబాబు సీటు ఇచ్చేసి దులిపేసుకున్నారు. నిజానికి భీమిలీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ నుంచి ఎవ్వరూ నిలబడ్డా గెలిచే పరిస్థితుల్లో లేరట.. సర్వేలన్నీ వైసీపీకే అనుకూలంగా ఉన్నాయి. అక్కడ అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరిన తర్వాత టీడీపీకి అసలు బలం పోయింది. దాంతోనే మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నఫళంగా విశాఖ ఉత్తరానికి షిఫ్ట్ అయిపోయారు. నారా లోకేష్ సైతం భీమిలి సేఫ్ కాదని మంగళగిరికి మంగళం పాడారు. అటువంటి టీడీపీ ఓడిపోయే సీట్లో ఇప్పుడు సబ్బం హరిని పోటీకి దింపి టీడీపీ ఆయనకు పరీక్ష పెట్టిందన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది.

నిజానికి సబ్బం హరి తనకు విశాఖ ఎంపీ సీటు ఇవ్వాలని బాబు వద్ద చివరి వరకూ ప్రయత్నించారట.. అయితే భీమిలి మాత్రమే ఖాళీగా ఉందని చెప్పడంతో చేసేదేంలేక సబ్బం హరి  అక్కడి నుంచి పోటీకి రెడీ అయ్యారు. అయితే భీమిలీలోని టీడీపీ నాయకులు మాత్రం హరిని తెచ్చి తమ నెత్తిన పెడుతారా అని సహాయ నిరాకరణ మొదలుపెట్టారట.. తాము పనిచేయమని సబ్బం హరికి స్పష్టం చేశారట.. తమలో ఒకరికి టికెట్ ఇస్తే గెలుపు ఖాయమని.. అలాంటిది బయట నుంచి నాయకులను తమపై రుద్దడం ఏంటని భీమిలీ టీడీపీ నేతలంతా దూరం జరుగుతున్నారట..

ఓ వైపు భీమిలీలో వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ దూసుకుపోతున్నారు. గట్టిగా 20 రోజులు కూడా లేని వేళ సబ్బం హరి ఈ అసమ్మతితో తర్జన భర్జన పడుతున్నాడట. భీమిలి వైపు ఇప్పుడే అడుగులు వేస్తున్న క్రమంలో ఆయనకు ఓటమి కళ్లముందు కనిపిస్తోందట.. కిందా మీద పడి టికెట్ తెచ్చుకోవడమే కష్టమైన నేపథ్యంలో  ఇప్పుడు ఓడిపోయే సీటును చంద్రబాబు ఇచ్చారని తెలిసి సబ్బం హరి బాధ వర్ణనాతీతం అంటున్నారట ఆయన పరిస్థితిని చూసిన దగ్గరి వాళ్లు.. రాజకీయ పబ్బం గడుపుకొని సబ్బంకు ఈ సీటును బాబు ఇచ్చేశాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News