తాజామంత్రి, మాజీ మంత్రి.. ఇద్దరూ బంధువులే.. దగ్గరి చుట్టరికమే.. కానీ పలకరింపులు లేవు.. కనీసం చూసుకోవడమూ లేదు. టీఆర్ ఎస్ లో ఓడిపోయిన మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, గెలిచి మంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అయినా పలకరించుకోకపోవడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారిందట..
2014లో తాండూరు నుంచి గెలిచిన మహేందర్ రెడ్డి మంత్రి అయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంత్రిగా ఆయన కీరోల్ పోషించారు. వేగంగా ప్రజల్లోకి వెళుతూ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే 2019లో ఆయన తాండూరు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ రెడ్డి గెలిచాడు. అయితే ఇటు రోహిత్ రెడ్డి గులాబీ పార్టీలో చేరారు. రంగారెడ్డి జిల్లాలో సీనియర్లు ఎవరూ లేకపోవడం.. మహేశ్వరం నుంచి సబితా కాంగ్రెస్ నుంచి గెలవడంతో ఆమె గులాబీ పార్టీలో చేరి మంత్రి అయ్యారు.
స్వతహాగా బంధువైన సబితా ఇంద్రారెడ్డిని కనీసం పలకరించిన పాపానపోలేదట మహేందర్ రెడ్డి. సబితా రాకతో మహేందర్ రెడ్డి ఉత్సవ విగ్రహంగా మారిపోయారట.. టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్సీని చేసినా అధికారం మాత్రం అంతా సబిత - రోహిత్ రెడ్డికే కట్టబెట్టిందట..
దీంతో ఈ మున్సిపల్ ఎన్నికల్లోనూ పోయినసారి చక్రం తిప్పిన మహేందర్ రెడ్డి డమ్మీ అయిపోయారట.. కనీసం తన వారికి కూడా టికెట్లు ఇప్పించుకోలేకపోయారు. అంతా సబిత - రోహిత్ రెడ్డికే కేటీఆర్ బాధ్యతలు అప్పజెప్పడంతో మౌనం దాల్చారు. అధికారం లేకపోతే ఎలా ఉంటుందో మహేందర్ రెడ్డికి ప్రత్యక్షంగా అర్థమవుతోందట.. అదీ సంగతి.