గులాబీ పార్టీ లో హాట్ టాపిక్ గా మారిన అత్తా.. అల్లుడి కోల్డ్ వార్

Update: 2019-11-11 07:33 GMT
వ్యక్తి గత అనుబంధాల్ని సైతం దూరం చేసే గుణం రాజకీయానికి ఉంటుంది. రాజకీయ పరమైన విభేదాలు వ్యక్తుల మధ్య ఎంత దూరాన్ని పెంచుతాయన్నది తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తాజాగా తాండూరు నియోజకవర్గంలో పర్యటించారు. మంత్రి పాల్గొన్న కార్యక్రమం కాబట్టి.. సదరు ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ సైతం హాజరు కావాల్సి ఉంటుంది.

కానీ.. అందుకు భిన్నమైన పరిస్థితి అక్కడ చోటు చేసుకుంది. ఆసక్తి కరమైన మరో విషయం ఏమంటే.. సబిత కు వరుసకు అల్లుడయ్యే ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కార్య క్రమానికి డుమ్మా కొట్టటం గులాబీ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయనే కాదు.. మహేందర్ రెడ్డి సతీమణి..జెడ్పీ ఛైర్ పర్సన్ సునీతా రెడ్డి సైతం కార్య క్రమానికి దూరంగా ఉన్నారు. దీంతో.. అత్తా.. అల్లుళ్ల మధ్య నడుస్తున్న అధిపత్య పోరు అందరికి అర్థమయ్యేలా చేసింది.

 రాజకీయం గా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసినా.. ఏ స్థాయి లో అన్న విషయం తాజా తాండూరు ఎపిసోడ్ తో స్పష్టమైందంటున్నారు.
వాస్త వానికి మంత్రి గా సబిత బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆయన సతీమణి సునీతా రెడ్డిలు కలిసి మర్యాద పూర్వకం గా కలిసింది లేదు. ఇదిలా ఉంటే.. సబిత పర్యటన లో తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హైలెట్ అయ్యారు. ఆయన దగ్గరుండి మరీ మంత్రి సబిత కు స్వాగతం పలకటమే కాదు.. సదరు కార్య క్రమానికి అన్నీ తానై అన్నట్లు గా వ్యవహరించారు. దీంతో.. అత్తా.. అల్లుళ్ల మధ్య సంబంధాలు ఏ మాత్రం పొసగటం లేదన్న విషయం స్పష్టమైందంటున్నారు.
Tags:    

Similar News