సచిన్ అంటే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కాదులెండి.. ‘మౌనమేలనోయి’.. ‘ఒరేయ్ పండు’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న బాలీవుడ్ బాబు సచిన్ జోషి. చాన్నాళ్లుగా వేలంలో అమ్ముడు పోకుండా ఉన్న విజయ్ మాల్యా లగ్జీరియస్ విల్లాను అతను సొంతం చేసుకున్నాడు. దాదాపు రూ.75 కోట్లు పెట్టి అతను ఆ విల్లాను కొన్నట్లు సమాచారం.
బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ వెళ్లిపోయిన వైట్ కాలర్ క్రిమినల్ విజయ్ మాల్యాకు చెందిన ఆస్తుల్ని రెండేళ్ల కిందటే పలు బ్యాంకులు సొంతం చేసుకున్నాయి. గోవాలో మాల్యాకు చెందిన విల్లాను స్వాధీనం చేసుకున్న ఎస్బీఐ దాన్ని అమ్మడానికి చాలా ప్రయత్నాలే చేసింది. ముందు రిజర్వ్ ధరను రూ.85 కోట్లు పెట్టిన ఆ బ్యాంకు.. ఆ తర్వాత కొనుగోలుదారుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో రిజర్వ్ ధరను తగ్గిస్తూ వచ్చి చివరికి రూ.73 కోట్లు చేసింది. ఐతే సచిన్ దానికంటే కొంచెం ఎక్కువ ధరే పెట్టి విల్లాను సొంతం చేసుకున్నాడట.
మాల్యా విల్లా గురించి సెలబ్రెటీలు ఓ రేంజిలో చెబుతారు. వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ అయితే.. అదో భూతల స్వర్గం అన్నట్లుగా దాని గురించి ప్రత్యేక వ్యాసమే రాశాడు. ఈ విల్లాకు మాంచి క్రేజే ఉన్నప్పటికీ ఇలా వేలంలో కొనుక్కోవడంతో భవిష్యత్తులో ఏవైనా తలనొప్పులు ఎదురవుతాయనుకున్నారో ఏమో.. చాలామంది ముందుకు రాలేదు. ఐతే సచిన్ మాత్రం ధైర్యంగా వచ్చి విల్లా కొనేశాడు. అతడికి జేఎంజే గ్రూప్ తరఫున చాలా వ్యాపారాలున్న సంగతి తెలిసిందే. రూ.73 కోట్లు పెట్టి విల్లా కొన్నాడంటే అతడి రేంజేంటో అంచనా వేయొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/