ఓటర్లనే కాదు.. పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్లను కూడా ఆకర్షించేస్తున్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన గ్రాఫ్ ఎంతలా పెరిగిందో.. ఆయనెంత బలమైన నేతగా అవతరించారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోడీని ఆదర్శంగా తీసుకోవాలని.. మోడీని వ్యాపారస్తులంతా ఫాలో కావాలంటూ ఆసక్తికర వ్యాఖ్యను చేశారు ఫ్లిప్ కార్ట్ సీఈవో సచిన్ బన్సాల్. మోడీ నుంచి తాను తీసుకున్న సూత్రాన్నిఆయన చెప్పటమే కాదు.. అందరూ అనుసరించాలని చెప్పారు.
ప్రజలను ఆకర్షించటం ఎలానో ప్రధాని మోడీని చూసి నేర్చుకోవాలని.. దేశ ప్రజలను మోడీ చాలా చక్కగా అర్థం చేసుకున్నారని.. ఆ విషయం తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్ని చూస్తే అర్థమవుతుందనిఆయన వ్యాఖ్యానించారు. ‘‘మోడీ ఈ దేశాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నరో తాజా ఎన్నికల ఫలితం చూస్తే అర్థమవుతుంది. ఇది వ్యాపారవేత్తలకు పాఠం కావాలి. మీ వినియోగదారుల్నికూడా.. మీరూ ఇలాగే అర్థం చేసుకోవాలి’’ అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
మోడీని కొత్త కోణాన్ని విప్పి చెప్పిన సచిన్ బన్సాల్ ట్వీట్ పై ప్రధాని మోడీనే రియాక్ట్ అయ్యారు. తాను ప్రజల్ని అర్థం చేసుకోవటం కంటే కూడా..ప్రజలు తనపైనా.. పార్టీ పైనా నమ్మకాన్ని ఉంచారని..దాన్ని వమ్ము కానివ్వనంటూ రీట్వీట్ చేశారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల పట్ల మోడీ ఎలా ఆలోచిస్తున్నారన్న విషయాన్ని ఆయన తన రీట్వీట్ ద్వారా చెప్పేయటమే కాదు.. భారీ గెలుపు తర్వాత కూడా తానెంత ఒదిగి ఉన్నానన్న విషయాన్ని చెప్పకనే చెప్పేయటం కనిపిస్తుంది. తనకు లభించిన ఏ చిన్న అవకాశాన్ని మోడీ వదిలిపెట్టరన్న విషయం తాజా ఉదంతం మరోసారి స్పష్టం చేసిందని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/