రైతుల ఆందోళనపై సచిన్ ఘాటు వ్యాఖ్యలు

Update: 2021-02-03 15:30 GMT
కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు రెండు నెలలుకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లో హోరెత్తిస్తున్నారు. ఇటీవల ఈ నిరసన హింసాత్మకంగా మారింది. అంతర్జాతీయ స్థాయిలోనూ రైతులకు మద్దతు లభిస్తోంది.

ఈ క్రమంలోనే రైతుల ఉద్యమానికి ఇప్పటికే ప్రముఖ సింగర్, నటి రాబిన్ రిహన్నా, స్వీడన్ పర్యావరణ ప్రేమికురాలు గ్రెటా థంబర్గ్ లు రైతుల ఉద్యమానికి మద్దతు పలికారు. కేంద్రంలోని బీజేపీ తీరును తప్పుపట్టారు.ఈ క్రమంలోనే రైతుల ఆందోళనపై తొలిసారి టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. రైతుల ఆందోళనలకు మద్దతు తెలుపుతూ.. కేంద్రాన్ని విమర్శిస్తూ అంతర్జాతీయ సెలబ్రిటీలు ట్వీట్లు చేయడంపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు.

'భారతదేశ సార్వభౌమాధికారం విషయంలో ఏమాత్రం రాజీపడాల్సిన అవసరం లేదు.  బయట వ్యక్తులు కేవలం  ప్రేక్షకులు మాత్రమే. పాల్గొనేవారు కాదు.. భారత్ అంటే ఏంటో భారతీయులకే తెలుసు.. దేశానికి ఏం కావాలో దేశమే నిర్ణయిస్తుంది. ఒక జాతిగా అందరం ఐక్యంగా ఉందాం' అని ట్వీట్ చేశారు.
Tags:    

Similar News