భారతదేశంలో క్రికెట్ ఒక మతం అయితే.. ఆ మతానికి దేవుడు సచిన్ టెండుల్కర్ అంటారు! ఆ స్థాయిలో క్రికెట్ దేవుడిగా సచిన్ నీరాజనాలందుకున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో బ్యాట్ పట్టిన సచినే కాదు... "శ్రీమంతుడు" సచిన్ ని కూడా దేవుడనే అంటున్నారు ఒక గ్రామ ప్రజలు. అవును... నెల్లూరు జిల్లాలోని ఓ మారుమూల గ్రామాన్ని దత్తత తీసుకున్న సచిన్ ఇప్పుడు అక్కడి ప్రజలకు దేవుడయ్యాడు! ఆగ్రామంలో అక్కడి ప్రజలు కలలో కూడా ఊహించని మార్పులు తీసుకొచ్చాడు. ఈ రేంజ్ లో చేసిన సచిన్ మనసు తెలియాలంటే.. నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు కండ్రిగకు వెళ్లాల్సిందే.
నెల్లూరులో పుట్టంరాజు కండ్రిగ అనే గ్రామం ఉందనే విషయం సచిన్ దత్తత తీసుకోకముందు ఎంతమందికి తెలుసు? ఆ సంగతి అటుంచితే సచిన్ దత్తత అనంతరం ఆ గ్రామం గురించి దేశమంతా తెలిసింది. అసలు సచిన్ ఈ గ్రామాన్నే ఎలా ఎంపిక చేసుకున్నారో ముందు తెలుసుకుందాం. 2014లో నెల్లూరు జిల్లా కలెక్టర్ గా పనిచేసిన శ్రీకాంత్.. జిల్లా మొత్తం మీద ఒక గ్రామానికి ఆధునిక సౌకర్యాలు కల్పించి తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే గతంలో జేసీగా పనిచేసిన రేఖారాణి ప్రత్యేక చొరవతో ప్రముఖ క్రికెటర్, ఎంపీ సచిన్ సంసద్ ఆదర్శ యోజన కింద దత్తత స్వీకరించారు. ఈక్రమంలో రూ. 6.15 కోట్ల వెచ్చించి గ్రామాన్ని అభివృద్ధి చేశారు.
అంతకముందు ఈ గ్రామంలో మౌలిక సదుపాయాలు లేవు.. కానీ ఇప్పుడు ఆ గ్రామం రూపురేఖలు మొత్తం మారిపోయాయి. రెండేళ్ల క్రితం గ్రామాన్నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు.. ఇప్పుడు ఊరొచ్చి చూస్తే గుర్తుపట్టడం కూడా కష్టమనేంతగా మారిపోయింది. ఆధునిక సౌకర్యాల ఏర్పాటుతో తిరుమలకు వెళ్లే నార్త్ ఇండియన్స్ కూడా దారిలో సచిన్ గ్రామాన్ని చూసి ఆశ్చర్యోతున్నారట! భారతదేశం మొత్తం మీద సుమారు 7లక్షల గ్రామాలున్నాయి. అన్నీ ఇలా మారిపోతే ఎంతబాగుంటుందో కదా!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/