స‌దావ‌ర్తి వేలం... ఆళ్ల మాటే నిజ‌మైంది!

Update: 2017-09-18 10:32 GMT
ఏపీలో పెను దుమారం రేపిన స‌దావ‌ర్తి స‌త్రం భూముల వేలం వ్య‌వ‌హారం చంద్ర‌బాబునాయుడు స‌ర్కారుకు నిజంగానే గ‌ట్టి దెబ్బే కొట్టింద‌ని చెప్పాలి. టీడీపీకి చెందిన వ్య‌క్తుల‌కు కారు చౌక‌గా ఈ భూముల‌ను క‌ట్ట‌బెట్టిన చంద్ర‌బాబు స‌ర్కారు ద‌మ‌న నీతిని ప్ర‌శ్నించిన వైసీపీ కీల‌క నేత‌ - గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఏకంగా న్యాయ‌పోరాటానికే దిగారు. హైకోర్టు మొద‌లుకొని సుప్రీంకోర్టు దాకా ఆయ‌న సాగించిన పోరాటం... బాబు స‌ర్కారును దోషిగా నిల‌బెట్టిందని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌మ పార్టీ నేత‌ల‌కు ద‌క్కిన ఈ భూములు వేరే వారికి ద‌క్క‌కుండా చేసేందుకు చంద్రబాబు స‌ర్కారు అందుబాటులో ఉన్న అన్ని అవ‌కాశాల‌ను వాడేసింది. అయితే కోర్టులో ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి చేసిన గ‌ట్టి వాద‌న‌లు... చంద్రబాబు స‌ర్కారుకు ఎక్క‌డికక్క‌డ బ్రేకులు వేశాయ‌నే చెప్పాలి.

స‌దావ‌ర్తి స‌త్రానికి సంబంధించి త‌మిళ‌నాడు ప‌రిధిలో ఉన్న 86 ఎక‌రాల భూమి తాజా వేలంలో ఏకంగా రూ.60.30 కోట్ల‌కు అమ్ముడుబోయాయి. ఈ రేటు గ‌తంలో టీడీపీ స‌ర్కారు విక్ర‌యించిన ధ‌ర కంటే దాదాపుగా మూడు రెట్లు అధికంగా ఉంది. హైకోర్టు ఆదేశాల మేర‌కు నేటి ఉద‌యం వేలం నిర్వ‌హించాల్సి ఉండ‌గా... ఈ వేలాన్ని ఎలాగైనా వాయిదా వేయించాల్సిందేనన్న ప‌ట్టుద‌లతో చంద్ర‌బాబు స‌ర్కారు విశ్వ య‌త్నాలు చేసింది. అయితే స‌ర్కారు కుట్ర కోణాన్ని ముందుగానే ప‌సిగట్టిన ఆళ్ల‌... నేరుగా సుప్రీంకోర్టు త‌లుపు త‌ట్టేశారు. ఈ నేప‌థ్యంలో ఈ వ్య‌వ‌హారంపై జోక్యం చేసుకున్న సుప్రీంకోర్టు.. వేలం వాయిదా కుద‌ర‌దంటే కుద‌ర‌ద‌ని స్ప‌ష్టం చేయ‌డంతో నేటి ఉద‌యం వేలం జ‌రిగిపోయింది. ఈ వేలానికి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డితో పాటు పెద్ద సంఖ్య‌లో బిడ్డ‌ర్లు పాల్గొన్నారు. చెన్నైలో నేటి ఉద‌యం దాదాపుగా గంట పాటు హోరాహోరీగా సాగిన వేలంలో ఈ భూముల‌ను క‌డ‌ప జిల్లాకు చెందిన ప్ర‌ముఖ కాంట్రాక్ట‌ర్ రూ.60.30 కోట్ల‌కు ద‌క్కించుకున్నారు.

పోటాపోటీగా సాగిన వేలాన్ని చూసిన టీడీపీ స‌ర్కారు... ఇక త‌మ ప‌ని అయిపోంద‌న్న కోణంలో ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని చూస్తూ కూర్చోవ‌డం మిన‌హా మ‌రేమీ చేయ‌లేకపోయింద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక ఈ భూముల‌ను ద‌క్కించుకున్న కాంట్రాక్ట‌ర్ విష‌యానికి వ‌స్తే.. క‌డ‌ప జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, ప్రొద్ద‌టూరు మాజీ ఎమ్మెల్యే వ‌ర‌ద‌రాజుల రెడ్డి కుమారుడు స‌త్యనారాయ‌ణ రెడ్డి ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న స‌త్యనారాయ‌ణ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీ ఈ భూముల‌కు రూ.60.30 కోట్లు చెల్లించేందుకు ముందుకు వ‌చ్చింది. తొలుత కేవ‌లం రూ.20 కోట్ల‌కే ఈ భూముల‌ను అప్ప‌నంగా కొట్టేసిన వ్య‌క్తులు ఈ ధ‌ర‌ను చూసి అవాక్క‌య్యార‌ట‌. ఇక ఈ భూముల‌ను కారు చౌక‌గా చంద్ర‌బాబు అనుయాయులు కొట్టేశార‌ని ఆళ్ల చేసిన ఆరోప‌ణ‌లు నిజ‌మ‌ని తేలాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి ఈ వ్య‌వ‌హారంపై చంద్ర‌బాబు స‌ర్కారు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News