కొందరికి ఆయన నియంత. మరికొందరికి.. ఆయనో సింహం. ఆయన ఎలాంటి వాడైనా సరే.. ఇరాక్ అధ్యక్షుడి హోదాలో ఉన్న ఆయన్ను బంధీగా చేసి.. జైల్లో పెట్టి.. కోర్టులో విచారించి.. అధికారికంగా ఉరి తీయించటంలో ఆగ్రరాజ్యం అమెరికా తానేం చేయాలనుకుందో అదే చేసింది. ఈ వ్యవహారం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. ప్రపంచాన్ని ప్రమాదంలో పడేసే ఆయుధాలు ఉన్నాయంటూ దండెత్తిన అమెరికా.. సద్దాంను చంపేయగలిగిందే తప్పించి తాను ఆరోపణలు చేసినట్లుగా మాత్రం జీవ ఆయుధాల్ని మాత్రం చూపించలేకపోయింది.
మూడు దశాబ్దాల పాటు ఇరాక్‌ను పాలించిన సద్దాం.. తన చివరి రోజుల్లో మాత్రం జైల్లో కాలం గడపాల్సి వచ్చింది. మరి.. తిరుగులేని నియంతగా వ్యవహరించిన ఆయన.. జైల్లో ఉన్న చివరి రోజుల్లో ఎలా వ్యవహరించేవారన్న సందేహం రాక మానదు. అలాంటి వాటికి సమాధానాలు లభించేలా తాజాగా ఒక పుస్తకం బయటకు వచ్చింది. సద్దాం జైల్లో ఉన్నప్పుడు ఆయన జైలు గదికి కాపలాగా ఉన్న అమెరికన్ గార్డు తాజాగా ఒక పుస్తకాన్ని రాశారు. ది ప్రిజనర్ ఇన్ హిజ్ ప్యాలెస్: సద్దాం హుస్సేన్ పేరుతో ఉన్న ఈ పుస్తకంలో సద్దాంకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
ఆర్నెల్లపాటు సద్దాంకు 12 మంది అమెరికన్ సైనికులు కాపలాగా ఉండేవారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఆయనతో సైనికులు సన్నిహితంగా ఉండటమే కాదు.. ఆయన చనిపోయేవరకూ సైనికులతో స్నేహపూర్వకంగా మెలిగినట్లుగా పుస్తకంలో రాశారు. జైలు గదిలో ఓ పక్కన కూర్చొని ఉండేవారని.. అందమైన పూలను చూస్తూ గడిపేవారని పుస్తక రచయిత బర్డన్ వేర్సర్ వెల్లడించారు. తాను తీసుకునే ఫుడ్ విషయంలో మాత్రం సద్దాం చాలా జాగ్రత్తగా ఉండేవారని..అమ్లెట్.. కేక్.. తాజా పండ్లను బ్రేక్ ఫాస్ట్ గా చేసేవారన్నారు.
ఒకవేళ ఎప్పుడైనా ఆమ్లెట్ సరిగా లేకపోతే తినేందుకు నో చెప్పే వారని..తనకు కాపలాగా ఉన్న సైనికులకు కథలు చెప్పేవారని చెప్పేవారు. తన కొడుకు పట్ల తాను ఎంత క్రమశక్షణగా ఉండేవాడో చెప్పేవారన్నారు.
ఇందుకు సంబంధించిన ఒక ఉదంతాన్ని తమతో ప్రస్తావించినట్లుగా అమెరికన్ సైనికుడు బర్డన్ వేర్పర్ చెప్పారు. తన కొడుకు ఉదయ్ ఒకసారి పార్టీ చేసుకుంటున్న వారిపై దాడి చేసి చాలామంది ప్రాణాలు తీశాడని.. ఆ విషయం తనకు చాలా కోపాన్ని కలిగించినట్లుగా సద్దాం చెప్పారు. వెంటనే తన కొడుకు కార్లు అన్నింటిని తాను నిప్పు పెట్టి కాల్చేసినట్లుగా చెప్పినట్లుగా పుస్తకంలో పేర్కొన్నారు. తన కొడుకు దగ్గర రోల్స్ రాయిస్.. ఫెరారీ.. పోర్షే లాంటి విలాసవంతమైన.. ఖరీదైన కార్లు ఉండేవని ఆయన చెప్పిన్నట్లుగా వెల్లడించారు. ఎంత నియంత అయినా.. క్రమశిక్షణలో భాగంగా సొంత కొడుకైనా సరే కట్టు దాటితే శిక్షించే సద్దాం లాంటి పాలకుల్ని మన ఇప్పుడు చూడగలమా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/