బాద్ షా కాదు.. పాక్ ఏజెంట్ అంట

Update: 2015-11-03 07:53 GMT
పుట్టినరోజు నాడు చక్కగా కేక్ కట్ చేసేసి.. స్నేహితులు.. బంధువుల విషెస్ ను తీసుకుంటూ.. త్వరలో విడుదల కానున్న తన సినిమా ప్రమోషన్ లో తలమునకలు కావాల్సిన బాలీవుడ్ బాద్ షా షారూక్ చేయకూడని తప్పు చేసేశారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. గత కొన్ని రోజులుగా దేశంలో పరమత అసహనం పెరిగిపోతుందన్న ఆందోళన వ్యక్తవుతున్న నేపథ్యంలో ఆయన కూడా గళం విప్పటం తెలిసిందే.

తాజాగా షారూక్ ఖాన్ చేసిన ఆరోపణలపై బీజేపీ నేతల ఫైరింగ్ మొదలైంది. బీజేపీ నేతల మండిపాటుకు తాజాగా వీహెచ్ పీ నేత సాద్వీ ప్రాచీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లో నెలకొన్న పరిస్థితులపై షారూక్ అసంతృప్తి వ్యక్తం చేయటంపై తీవ్రస్థాయిలో మండిపడిన ఆమె.. ఇక షారూక్ దేశం విడిచి వెళ్లిపోవచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పరమత అసహనం పెరిగిపోతున్న నేపథ్యంలో అవసరమైతే.. తనకిచ్చిన పురస్కారాల్ని వెనక్కి ఇచ్చేయటం కోసం తాను వెనుకాడననంటూ షారూక్ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.  ఇలా ఎవరికి వారు సంయమనంతో వ్యవహరించకుండా వ్యాఖ్యల మీద వ్యాఖ్యలు చేస్తే.. ఈ మొత్తం వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుందోనన్న ఆందోళన పలువురు వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News