సైఫ్ అలీఖాన్.. ఈ బాలీవుడ్ అగ్రహీరో నవాబులు వంశానికి చెందిన వాడు. పటౌడీ సంస్థానాలు పూర్వం వీరి తాతముత్తాతలకు ఉండేది. దీంతో వారసత్వంగా ఓ అపురూపమైన ప్యాలెస్ సైఫ్ అలీఖాన్ కు వచ్చింది. వందల కోట్ల విలువైన ఆ భవంతి గురించి తెలిస్తే నిజంగా షాక్ అవుతారు.
హర్యానా రాష్ట్రంలోని పటౌడీ ప్రాంతంలో సైఫ్ అలీఖాన్ కు ఓ ప్యాలెస్ వంశపారంపర్యంగా వచ్చింది.దీన్ని ‘ఇబ్రహీం కోఠి’ అంటారు. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్యాలెస్ చుట్టూ అందమైన ఉద్యానవనాలు, పెద్ద స్విమ్మింగ్ ఫూల్, మధ్యలో ఖరీదైన భవంతి ఆశర్యపరిచేలా ఉంటుంది.
ఈ రాజరికపు కట్టడం విలువ దాదాపు 800 కోట్ల రూపాయలని సమాచారం. మొత్తం 150 గదులతో కూడి ఉన్న ఈ ప్యాలెస్ లో 7 డ్రెస్సింగ్ రూమ్స్, మరో 7 పడకగదులు, డ్రాయింగ్ రూమ్స్, పెద్ద డైనింగ్ హాల్ తోపాటు సువిశాలమైన గదులున్నాయి.
సైఫ్ తండ్రి మన్సూర్ అలీఖాన్ పటౌడి మరణం తర్వాత ఈ ప్యాలెస్ ఈ బాలీవుడ్ హీరోకు వచ్చింది. ఈ ప్యాలెస్ కు సైఫ్ కొత్తరంగులు వేశారు. సైఫ్ కుటుంబానికి సంబంధించిన వేడుకలన్నీ ఈ ప్యాలెస్ లోనే చేసుకుంటారు.
1991లో అమృత్ సింగ్ ను సైఫ్ అలీఖాన్ పెళ్లాడారు. ఇద్దరు పిల్లలు పుట్టాక ఆమెకు విడాకులు ఇచ్చాడు. 2012లో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ను పెళ్లాడాడు. ఈ ఇద్దరికీ ‘తైమూర్’ పుట్టాడు. ఇప్పుడు తైమూర్ వేడుకలు కూడా ఇదే ప్యాలెస్ లో నిర్వహించారు. ఆ ఫొటోలు వైరల్ కావడంతో ఈ ప్యాలెస్ పై అందరి దృష్టి పడింది.