లోకో భిన్న రుచి- అన్నట్టుగా దేశంలో లింగ మార్పిడి కొత్తకాదు! ఎవరికి ఇష్టమైన రీతిలో వారు బతికే స్వేచ్ఛ ఉన్న ఈ దేశంలో ప్రజలు తమ తమ ఇష్టా ఇష్టాలను పక్కవారికి ఇబ్బంది లేకుండా తీర్చుకోవచ్చు. ఈ క్రమంలోనే అనేక మంది యువకులు `ఆమె`గా మారితే ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్ట్‌తో లింగ మార్పిడి ఆపరేషన్లు చేయించుకున్నారు. అయితే, వీరంతా సుఖంగా ఉన్నారా? బాధలు పడుతున్నారా? సమాజం వీరిని చేరదీసిందా? ఇవన్నీ ఎవరికీ అవసరం లేదు. వారి జీవితాలు వారివి. ఇలా లింగ మార్పిడి చేయించుకున్న ఏ ఒక్కరిని పలకరించినా.. ``సమాజంలో భిన్నంగా ఉండడంలో ఉండే ఆనందాన్ని మేం అనుభవిస్తున్నాం`` అంటూ సమాధాన మిస్తారు. ఇలా లింగమార్పిడి చేయించుకున్న వారిలో కొందరు తమ తమ కుటుంబాలకు కూడా దైరమై బతుకు వెళ్లదీస్తున్నారు. తాజా ఘటనలో ఓ యువకుడు ఇలానే `ఆమె`గా మారాడు. అయితే, ఊహించని పరిణామం ఎదురై.. న్యాయపోరాటానికి సిద్ధమయ్యాడు. మరి ఆ ఆమెగా మారిన అతడు ఎవరు? ఆ స్టోరీ ఏంటి? ఆసక్తిగా ఉన్న ఆ విషయం చూద్దాం..
ఏడేళ్ల క్రితం విశాఖపట్నంలో నేవీ సెయిలర్ గా చేరిన మనీష్ కుమార్ గిరి కొన్ని నెలల కిందట 22 రోజుల సెలవు తీసుకున్నాడు. ఈ సమయంలో అతడు ఢిల్లీ వెళ్లి ప్రత్యేకంగా 'లింగ మార్పిడి' ఆపరేషన్ చేయించుకొని.. సబీగా మారాడు. అనంతరం విధులకు హాజరయ్యాడు. తిరిగి చేరిన తర్వాత అతని ప్రవర్తనలో `ఆమె` కనిపించడంతో అధికారులు ఆరా తీశారు. అటు మాటలోను - ఇటు శారీరకంగానూ తేడా రావడంతో ఖంగు తిన్నారు. ఏం జరిగిందని ప్రశ్నించారు. దీంతో నబీ జరిగిన విషయాన్ని వివరించింది. ఇక, ఏమాత్రమూ ఆలోచించకుండా.. భారత నౌకాదళ అధికారులు కొరడా ఝులిపించారు.
తమకు తెలియపర్చకుండా లింగమార్పిడి చేసుకున్నాడంటూ సబి ని ఉద్యోగం నుంచి తొలగించారు. సొంత అభీష్టం మేరకే సబి లింగమార్పిడి చేయించుకుందని, భారత నౌకాదళ నిబంధనల ప్రకారం ఆమె (లేదా అతడిని) ఉద్యోగంలో కొనసాగించడం కుదరదని నేవీ వివరణ ఇచ్చింది. అయితే, శరీరంలో అవయవాలు మారాయన్న కారణంతో తాను 'అన్ ఫిట్' అని ముద్రవేసి జాబ్ నుంచి తీసేయడంపై సుప్రీంకోర్టుకు వెళుతానని సబి చెబుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. అయితే.. కొసమెరుపు ఏంటంటే.. ట్రాన్స్ జండర్లూ.. మనుషులేనని , వారికి కూడా హక్కులు ఉన్నాయని, వారికీ అన్ని హక్కులూ వర్తిస్తాయని ఏడాది కిందట అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అంతేకాదు, వీరికి ఎన్నికల్లో ప్రత్యేక ఓటు హక్కు కల్పించారు. ఇక, ఏపీలో అయితే, ట్రాన్స్‌జండర్లకు నెలకు వెయ్యి రూపాయల పింఛన్ ను ఇటీవల ప్రకటించడం గమనార్హం. మరి సబి కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.