సైనా నెహ్వాల్.. భారత బ్యాడ్మింటన్ లో ఓ పెను సంచలనం. ఈరోజు దేశంలో లక్షల మంది బ్యాడ్మింటన్ బాట పడుతున్నారంటే ఆమె స్ఫూర్తితోనే. ఒక్క అంతర్జాతీయ టైటిల్ గెలిస్తేనే గొప్ప అనుకున్న పరిస్థితుల్లో.. ప్రతిష్టాత్మకమైన సూపర్ సిరీస్ టైటిళ్లతో పాటు ఎన్నో అద్భుత విజయాలు సాధించి భారత కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించింది సైనా. ఐతే ఆమె ఎదుగుదలలో కోచ్ గోపీచంద్ పాత్ర కొట్టిపారేయలేనిది. దేశంలో ఏ క్రీడలో చూసినా గురుశిష్యుల జోడీల్లో వీరిదే ‘ది బెస్ట్’ అనడంలో మరే మాట లేదు. ఆరేడేళ్ల పాటు గొప్ప సమన్వయంతో సాగింది ఈ జోడీ. గోపీ లేకుండా సైనా లేదు అనుకున్న పరిస్థితుల్లో అనూహ్యంగా గోపీకి గడ్ బై చెప్పేసి.. హైదరాబాద్ వదిలేసి.. బెంగళూరుకు వెళ్లి విమల్ కుమార్ దగ్గర శిక్షణ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఐతే సైనా నిర్ణయం సరైందే అనిపించేలా.. విమల్ దగ్గర శిక్షణ తీసుకున్నాక ఆమె ఆట ఎంతో మెరుగైంది. హైదరాబాద్ నుంచి వెళ్లే సమయానికి తొమ్మిదో ర్యాంకు లో ఉన్న సైనా.. నెంబర్ వన్ స్థానాన్ని చేరుకోవడం, వరుస విజయాలు సాధించడం విశేషం. గోపీ శిక్షణలో సాధించలేని ప్రపంచ ఛాంపియన్ షిప్ పతకాన్ని కూడా సైనా ఒడిసిపట్టింది. ఈ టోర్నీలో కాంస్యమే ఇప్పటిదాకా మనకు అత్యుత్తమ పతకం. కానీ సైనా ఏకంగా రజతం సాధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ను వదిలేసి బెంగళూరుకు వెళ్లి విమల్ దగ్గర శిక్షణ తీసుకోవడం గురించి సైనా స్పందించింది. ‘‘తల్లిదండ్రుల్ని, సొంతనగరాన్ని వదిలేసి బెంగళూరులో శిక్షణ తీసుకోవాలనుకోవడం కఠిన నిర్ణయమే. ఐతే ప్రపంచ నెంబర్ 2గా ఉన్న నేను.. తొమ్మిదో ర్యాంకుకు పడ్డాను. ఏ టోర్నీకి వెళ్లినా నిరాశ ఎదురయ్యేది. అసహనం కలిగేది. నా ఆట ఇది కాదని అర్థమవుతున్నా మార్చుకోలేకపోయా. మానసికంగా చాలా ఒత్తిడికి లోనయ్యా. చివరికి బ్యాడ్మింటన్ వదిలేయాలనుకున్నా. ఇప్పటికీ హైదరాబాద్ లో ఉండుంటే నా ర్యాంకు 20కి పడిపోయేదేమో. ఎవరినీ తప్పుబట్టడం నా ఉద్దేశం కాదు. నాకు ప్రత్యేక శిక్షణ కావాలనుకుంటా. అది నాకు దక్కలేదు. అందుకే బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. విమల్ శిక్షణ నాలో చాలా మార్పు తెచ్చింది. నాలో ఆయన ఆత్మవిశ్వాసం నింపారు. మునుపటి కంటే చాలా మెరుగయ్యా. అందుకే మంచి ఫలితాలొచ్చాయి’’ అని సైనా పేర్కొంది.
ఐతే హైదరాబాద్ లో ఉంటే ర్యాంకు 20కి పడిపోయేది.. నాకిక్కడ ప్రత్యేకమైన శిక్షణ దక్కలేదు... లాంటి మాటలు గోపీచంద్ గురించే అనడంలో సందేహం లేదు. ఒకప్పుడు సైనా మీద ఫుల్ ఫోకస్ పెట్టిన గోపీ ఆ తర్వాత ఆమెను నిర్లక్ష్యం చేశాడన్న అభిప్రాయాలున్నాయి. సింధు, శ్రీకాంత్ లాంటి వర్ధమాన క్రీడాకారుల మీద ఎక్కువ దృష్టిపెట్టి సైనాను పట్టించుకోకపోవడం వల్లే ఆమె అతడికి టాటా చెప్పేసిందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇప్పుడు సైనా ఆట, ఆమె మాట చూస్తుంటే ఇది వాస్తవమే అనిపిస్తోంది.