బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పై ఆమె అభిమానులు మండిపడుతున్నారు. ఆమె చేసిన తప్పంతా చైనాకు చెందిన ఫోన్ కంపెనీకి ప్రచారం చేయడమే. చైనా ఉత్పత్తులపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న తరుణంలో ఆమె ఆ ప్రకటనలో కనిపించడంతో అభిమానులు మండిపడుతున్నారు.
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ 'ఆనర్8'కి సైనా బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఆనర్ 8ని పట్టుకుని దిగిన ఫొటోను ఆమె ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసింది. అంతేకాదు, "నా కొత్త ఆనర్8 ఫోన్... ఫోన్ ను, దాని కలర్ ను ఎంతో ఇష్టపడుతున్నా" అంటూ కామెంట్ కూడా పెట్టింది. ఈ పోస్ట్ పై ఆమె అభిమానులు విరుచుకుపడున్నారు. చైనా కంపెనీకి ప్రచారం చేయడాన్ని వెంటనే ఆపివేయాలని కొందరు మండిపడ్డారు.
దేశానికి వ్యతిరేకమైన పనిని చేస్తున్నావని మరికొందరు తీవ్రంగా విమర్శించారు. చైనా వస్తువులను ప్రమోట్ చేయవద్దని... అది దేశానికి మంచిది కాదని ఇంకో అభిమాని సూచించాడు. అయితే... సైనా అభిమానులే కాదు, దేశంలోని మిగతా ప్రజలూ తాము మాత్రం చైనా ఫోన్లను బ్రహ్మాండంగా కొనుగోలు చేస్తున్నారు. చైనాకు చెందిన రెడ్ మీ ఫోన్లను ఫ్లిప్ కార్టులో అమ్మకానికి పెడితే రెండు నిమిషాల్లో మొత్తం కొనేస్తున్నారు. కానీ... ఆటగాళ్లు, ఇతర ప్రముఖులపై మాత్రం రాళ్లేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/