షర్మిల మీద సజ్జల ఇంటరెస్టింగ్ కామెంట్స్...

Update: 2022-11-29 10:45 GMT
వైఎస్ షర్మిల మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె. ప్రస్తుత ఏపీ సీఎం జగన్ కి సోదరి. తానుగా ఒక రాజకీయ పార్టీని నడుతున్నారు. ఏ రకంగా చూసుకున్నా ఆమె పొలిటికల్ గా ప్రముఖురాలే అని చెప్పాలి. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి షర్మిల తన వంతుగా చేయాల్సింది చేశారు. ఆమె పాదయాత్ర కూడా ఆ పార్టీకి బాగా కలసి వచ్చింది.

అలాంటి షర్మిల వైసీపీ అధికారంలోకి వచ్చాకా ఎక్కడా కనిపించలేదు. సుమారు రెండేళ్ళ క్రితం ఆమె తన రాజకీయ తోవ తాను చూసుకున్నారు. వైఎస్సార్టీపీ పేరిట పార్టీని స్థాపించి తెలంగాణా అంతటా కలియతిరుగుతున్నారు. ఆమె రాజకీయ విధానాలు ఆమె ఆలోచనలు ఆమెవి, వాటితో తమకు సంబంధం లేదని ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఏనాడో స్పష్టం చేసింది.

ఒక దశలో వైసీపీ కీలక నేత సజ్జల రామక్రిష్ణారెడ్డి ఆమె రాజకీయాలతో తమకు అసలు సంబంధం లేదని తేల్చేశారు. అలాంటి సజ్జల ఇన్నాళ్ళ తరువాత షర్మిల విషయంలో ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అవి కూడా చాలా జాగ్రత్తగా ఆచీ తూచీ అన్నట్లుగా ఉన్నాయి.

తెలంగాణా పోలీసులు షర్మిల ఉన్న కారుతో సహా క్రేన్స్ సాయంతో ఎత్తి మరీ ఏకంగా పోలీస్ స్టేస్థన్ కి తరలించారు. ఇది నిజంగా సినిమాల్లో ఎక్కడో జరిగే విధంగా సాగిన సీన్. ఇది తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపింది. నాయకులు అరెస్ట్ కావడం వేరు, ఇలా కారుతో సహా ఎత్తి  పడేసి మరీ అరెస్ట్ చేయడం వేరు. ఆ మీదట పంజా గుట్ట పోలీస్ స్టేషన్ లో షర్మిల మీద మూడు సెక్షన్లతో కేసు కూడా నమోదు చేశారు.

ఇప్పటిదాకా షర్మిల అరెస్టులు వేరు ఈ అరెస్ట్ వేరు. గట్టి సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేశారు. దాంతో ఇదే అంశం మీద సర్వత్రా చర్చ సాగుతోంది. తెలంగాణాలో ఇది హైలెట్ అయింది. ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. సహజంగా దీని మీద ఉత్సుకత అందరికీ ఉంది. దాంతో ఆ పార్టీ ముఖ్య నాయకుడు అయిన సజ్జల రామక్రిష్ణా రెడ్డిని మీడియా ఇదే విషయం మీద అడిగింది.

దాంతో ఆయన షర్మిల అరెస్ట్ బాధాకరం అంటూ కామెంట్స్ చేశారు. అది కూడా తనకు వ్యక్తిగతంగా అంటూ ఆయన చెప్పుకున్నారు. అంటే వైసీపీ తరఫున కాదు తన సొంత అభిప్రాయం ఇది ఆయన పేర్కొన్నారు అన్న మాట. ఒకనాడు ఇదే సజ్జల షర్మిల రాజకీయాలతో తమకు ఏ మాత్రం సంబంధం లేదు అని అన్నారు. అపుడు వ్యక్తిగతం అనలేదు. పార్టీ పరంగా చెప్పారనుకోవాలి. ఇపుడు వ్యక్తిగతం అంటే పార్టీకి ఆమె రాజకీయాలతో సంబంధం లేదు అని మరోసారి ఆయన చెప్పకనే చెప్పారా అన్న డౌట్లు వస్తున్నాయి.

దాంతో పాటు ఆయన మరిన్ని కామెంట్స్ చేశారు. వైఎస్సార్టీపీ తెలంగాణాలో ఉందని, ఆమె తీసుకునే రాజకీయపరమైన నిర్ణయాల మీద మీడియా తనను ప్రశ్నలు అడగడం తాను ప్రతిస్పందించడం కరెక్ట్ కాదని అంటున్నారు. అంటే ఆమె బాధ ఏదో ఆమెది ఆమె రాజకీయం ఆమెది తప్ప తమకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఆయన మళ్లీ మళ్లీ చెబుతున్నారు అన్న మాట. ఏది ఏమైనా చూస్తే షర్మిల  తెలంగాణా రాజకీయం వైసీపీని ఇండైరెక్ట్ గా ఇబ్బంది పెడుతుంది అనే అంటున్నారు.

ఆమె వైఎస్సార్ తనయ. ఆమె రాజకీయం తానుగా సొంతంగా చేసుకున్నా ఆమెకు అక్కడ ఏమైనా ఆటంకాలు ట్రబుల్స్ ఏర్పడినపుడు సహజంగానే అందరి చూపూ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మీద ఉంటుంది. ఇక టీయారెస్ కి వైసీపీకి మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయో ఆ లోపాయికారి బంధాలు ఏమిటో ఎవరికీ తెలియవు కానీ ఇది అన్నా చెల్లెళ్ళ బంధం. ఎంత రాజకీయం అనుకున్న షర్మిల అరెస్టుల మీద అరెస్టులు అవుతూంటే అది జస్ట్ పాలిటిక్స్ అని ఊరుకున్నా మీడియా ఉండనీయదు. అందుకే సజ్జల బాధాకరం అంటున్నారు అనుకోవాలేమో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News