జగన్ టూర్ ఎందుకో వివరంగా చెప్పిన సజ్జల

Update: 2021-06-12 04:32 GMT
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు రోజులు ఢిల్లీ పర్యటన ముగియటం తెలిసిందే. ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్ గా మారింది. అందరిలోనూ ఆసక్తిని పెంచింది. గడిచిన కొద్దిరోజులుగా ఢిల్లీ టూర్ ఉంటుందని చెప్పినా.. అది జరగకపోవటంపైనా చర్చ జరిగింది. ఇలాంటి సమయంలోనే జగన్ ఢిల్లీ టూర్ కు వెళ్లి.. విజయవంతంగా పూర్తి చేశారు.

కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షాతో పాటు మొత్తం ఐదుగురు కేంద్రమంత్రులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఇదే విషయాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఢిల్లీ పర్యటను వినియోగించుకునే వారని.. సీఎం జగన్ మాత్రంఅలా చేయలేదన్నారు.

రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ పనుల పూర్తి కోసమే జగన్ ఢిల్లీ పర్యటన సాగినట్లు చెప్పారు. జగన్ టూర్ మీద కొందరు తప్పుడు ఆర్పణలు చేస్తున్నారని మండిపడ్డారు. పలు పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి సంబంధిత మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపారని.. దాని ఫలాలు త్వరలోనే అందుతాయని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. బాబు మాదిరి చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం సీఎం జగన్ కు లేదన్నారు. తాజా టూర్ కు రాజకీయ అంశాలకు ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు.


Tags:    

Similar News