ఐటీ శాఖ విడుదల చేసిన ప్రెస్ నోట్ ఏపీ రాజకీయాన్ని హాట్ హాట్ గా మార్చేసింది. దేశంలో ఎక్కడైనా ఐటీ తనిఖీలు జరిగితే.. ఒక రోజు.. మహా అయితే రెండు రోజులు జరగటం మామూలే. దీనికి భిన్నంగా ఏకంగా ఐదారు రోజులు దాడులు జరిగిన వైనం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు బయటకు రాలేదన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. ఐటీ శాఖ ఒక ప్రెస్ రిలీజ్ చేసింది. దీని ప్రకారం ఒక కీలక నేత వద్ద పీఏగా పని చేసిన వ్యక్తితో పాటు.. పలువురి వద్ద ఐదారు రోజుల నుంచి తాము జరిపిన తనిఖీల్లో రూ.2వేల కోట్ల మేర పన్ను చెల్లించని ఆదాయాన్ని గుర్తించిందని పేర్కొనటం సంచలనంగా మారింది.
దీనిపై తెలుగుదేశంపార్టీ నేతలు డిఫెన్స్ లో పడ్డారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇలాంటివేళ.. రానున్న రోజుల్లో మరిన్ని తిప్పలు తప్పవంటున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడు.. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నోటి నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. అంతేకాదు.. ఆయన మాటల్ని అసాంతం వింటే.. ఏపీ విపక్ష నేత చంద్రబాబుకు గుండెలు అదిరిపోవటం ఖాయమని చెప్పకతప్పదు.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తమ్మీదా 40 ప్రాంతాల్లో జరిని ఐటీ దాడుల్లో రూ.2వేల కోట్లు అక్రమంగా తరలినట్లుగా అనుమానాలు వ్యక్తం చేసిన ఐటీ శాఖ మాట శాంపిల్ మాత్రమేనని.. రానున్న రోజుల్లో మరింత పెద్ద విషయాలు బయటకు వస్తాయన్నారు. ఐటీ దాడుల నేపథ్యంలో చంద్రబాబు.. ఆయన అనుచర వర్గం కిక్కురమనటం లేదన్నారు. రాష్ట్ర ప్రజల మీద పడిన రూ.3లక్షల కోట్ల అప్పు భారంలో అత్యధిక శాతం చంద్రబాబు జేబులోకి వెళ్లిందన్న మాట ఆయన నోటి నుంచి వచ్చింది.
తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. ఇప్పుడు దొరికింది చిన్న తీగ మాత్రమేనని.. పూర్తి విచారణ సాగితే బాబు లక్షల కోట్ల రూపాయిల బాగోతం బయటపడే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే.. బాబుకు అంతర్జాతీయ నేరస్తులతో సంబంధాలు ఉన్నట్లు స్పష్టమవుతుందన్న మాట ఆయన నోటి నుంచి వచ్చింది. ఐటీ శాఖ విడుదల చేసిన ప్రకటనపై బాబుతోపాటు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు నోరు విప్పటం లేదని ప్రశ్నించారు. సజ్జల నోటి నుంచి వచ్చిన మాట బాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తుందని చెప్పక తప్పదు.