గడిచిన మూడు నాలుగు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐకు పలువురు ఇచ్చిన వాంగ్మూలాలు బయటకు వస్తున్నాయి. గడిచిన రెండు రోజుల్లో వైఎస్ వివేకా కుమార్తె సునీత.. ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి చెప్పినట్లుగా వచ్చిన వాంగ్మూలం.. అందులోని అంశాలు పెను సంచలనంగా మారటమే కాదు.. కొత్త సందేహాలకు తెర తీసిన పరిస్థితి.
ఇలాంటి వేళ.. మీడియా ముందుకు వచ్చిన సజ్జల.. ఎప్పటిలానే తన వాదనను వినిపించారు. తమ మీద అదే పనిగా వచ్చి పడుతున్న ఆరోపణల తూటాలకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో.. ఎవరు ఆ బాధ్యత తీసుకుంటారన్న చర్చకుపుల్ స్టాప్ పెడుతూ.. కత్తి మీద సాము లాంటి ఈ పనిని పూర్తి చేయటానికి ముందుకు వచ్చారు ఏపీ ప్రభుత్వ సలహాదారుల్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి. ఒత్తిడి వల్ల కావొచ్చు.. లేకుంటే ఇబ్బందిముబ్బడిగా వచ్చి పడిన వాంగ్మూలాలు.. వాటితో తెర పైకి వచ్చిన సందేహాల్నితీర్చే విషయంలో ఆయన ఒకింత ఇబ్బందికి గురైన విషయం ఆయన మీడియా సమావేశాన్ని చూసినప్పుడు ఇట్టే అర్థమవుతుంది.
ప్రభుత్వ వాదనను వినిపించే వేళలో.. సజ్జల ఏదో వ్రతం చేస్తున్న వాడిలా ఉంటారు. ఆయన శాంత స్వభావానికి భిన్నంగా ఆయన ఆగ్రెసివ్ గా ఉండటమే కాదు.. తన వాదనను అంతే కచ్ఛితంగా వినిపించే ప్రయత్నం చేస్తారు. అలాంటి సజ్జల.. తాజా ప్రెస్ మీట్ వేళలో.. మాటకు మాటకు మధ్య ల్యాగ్ తీసుకోవటం.. చాలా మాటలకు లింకులు మిస్ కావటం కనిపిస్తుంది. ఇదంతా చూసినప్పుడు తానేం మాట్లాడితే ఏమవుతుందన్నసందేహంతో పాటు.. తాను మాట్లాడాల్సిన విషయం మీద క్లారిటీ కంటే కూడా కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉందన్న భావన కలిగేలా ఉంది.
సాధారణంగా సందేహాలకు సమాధానాలు చెప్పేందుకు కౌంటర్ ప్రెస్ మీట్ ఉంటుంది. కానీ.. సజ్జల మీడియా భేటీ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. సజ్జల లాంటి మేధావి నోటి నుంచి ఎలాంటి మాటలైతే రావని బలంగా నమ్ముతామో.. సరిగ్గా అలాంటి మాటలే ఆయన నోటి నుంచి రావటం విస్మయానికి గురి చేసేలా మారింది. వివేకా హత్యకు సంబంధించిన ఇచ్చిన వాంగ్మూలంలో.. ఆరోపణలు సూటిగా.. స్పష్టం ఉన్నాయి. వాటికి కౌంటర్ అంతే సూటిగా చెప్పేస్తే సరిపోయేది. అందుకు భిన్నంగా సజ్జల మాష్టారు చెప్పిన మాటలు జీర్ణించుకోలేని రీతిలో ఉండటం విశేషం.
కోడి కత్తి అన్న మాటలో వ్యంగ్యం కనిపిస్తోందని చెప్పటం ఒకసారి.. పుంఖానుపుంఖాలుగా వాంగ్మూలం చెప్పేయటం ఏమిటన్న వ్యాఖ్యతో పాటు.. ఒక గ్రంధంలా ఉందన్న మాటలు విన్నప్పుడు సీబీఐ నమోదు చేసే వాంగ్మూలానికి సజ్జల లాంటి వారు పరిమితులు పెట్టటం ఏమిటన్న భావన కలుగక మానదు.
అదే సమయంలో.. ‘నాకున్న అవగాహన ప్రకారం అంటూ’ ఆయన వినిపించిన వాదన పేలవంగా ఉంది. కొన్ని కేసుల్లో తీర్పు పాఠమే పేజీలకు పేజీలు ఉంటుంది. తీర్పు ఫైనల్ కాపీని సిద్ధం చేసే వేళలో.. కొన్ని ముఖ్యమైన కేసుల్లో వందల పేజీల్లో తీర్పు పాఠం రాయటం తెలిసిందే. అలాంటప్పుడు.. తీర్పు పాఠం ఒక పేజీనో.. ఒక పేరాతోనో ముగించక.. ఈ గ్రంధాల మాదిరి వందల పేజీలు రాయటం ఏమిటంటూ విరుచుకుపడితే ఎంత ఛండాలంగా ఉంటుంది? సజ్జల వారి తాజా మాటలు కూడా ఇప్పుడు అలానే ఉన్నాయి. వాంగ్మూలం గ్రంధాల మాదిరి ఉండటం ఏమిటంటూ ఆయన ప్రశ్నిస్తున్న వైఖరిపై విస్మయం వ్యక్తమవుతోంది.
మీడియా సమావేశంలో ఆయనఈ తరహా సిత్రమైన వ్యాఖ్యలు చాలానే చేశారు. శాంపిల్ గా కొన్నింటిని చూస్తే..ఆయన మాటల్లో ల్యాగ్ తో పాటు.. ఒకదానితో మరొకటి సంబంధం లేననట్లుగా ఉండటం కనిపిస్తుంది.
- వివేకా హత్య కేసులో రాజకీయరంగు పులిమి విశృంఖలంగా వ్యవహరిస్తున్నారు. ఎంత బురదజల్లుతున్నా ఇంతకాలం ఓపిగ్గా ఉన్నాం. వివేకా సొంత కుటుంబ సభ్యులే ఆరోపణలు చేయడం దారుణం. ఎలాంటి ఆధారలు లేకుండా సునీత ఆరోపణలు చేస్తున్నారు. సునీత చంద్రబాబు చేతిలో పావుగా మారారని అనిపిస్తోంది.
- సునీతమ్మ వాంగ్మూలాన్ని కొంత చదివాం అది కూడా ఓపిక ఉన్నంత వరకు. దానిలో వంశ వ్రక్షమంతా ఎందుకు పెట్టారో తెలీదు?
- వివేకానంద రెడ్డి పులివెందుల వెళ్లి వచ్చిన తర్వాత ఎర్ర గంగిరెడ్డితో.. తాను ఎంపీ అభ్యర్థినని వివేక చెప్పారని కోట్స్ లో పెట్టి రాశారు. వాంగ్మూలాంలో మాకైతే అలాంటిదేమీ కనిపించలేదు. మీడియా.. మీరు కూడా వాంగ్మూలాన్ని చదవండి. మీకైనా కనిపిస్తుందేమనని విన్నవించుకుంటున్నా.
- మాకు తెలీక అడుగుతున్నా.. ఒక క్రైంకు సంబంధించిన.. అందులోనూ సీబీఐ దర్యాప్తు చేస్తున్న సీరియస్ క్రైం.. ఒక వీవీఐపీ.. రాజకీయ అత్యున్నత స్థాయి కుటుంబానికి జరిగిన ఒక క్రైం.. ఐపీసీ సెక్షన్ లో 161 క్రైం ఉంటుందా? పొలిటికల్ స్టేట్ మెంట్ ఉంటుందా? కోడి కత్తి అనే వ్యంగ్యమైన భాష.. సంభోదన ఎవరిదో తెలుసు. ఆ అటాక్ కు సంబంధించి దానికి దీనికి ఏం సంబంధం?
- సీబీఐకు మరేం పని లేదా? వాంగ్మూలం పేరుతో ఒక నవలను డిక్టేట్ చేసుకుంటూ పోతే.. అదే పనిగా రాసుకుంటూ పోవటానికి? అసలు పెడతారా? పెడుతున్నట్లే అనిపిస్తోంది.. దీన్ని చూస్తుంటే?
- ఒక కుటుంబ పరమైన పొరపాట్లో.. అవలక్షణాలో ఉంటే వాటి గురించి చెప్పుకోవటం.. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతున్నట్లు ఉంటుందన్న ఉద్దేశంతో.. ఆపితే.. ఆయన సొంత కుటుంబ సభ్యులే దాన్ని తీసుకొచ్చి పెద్దది చేసి.. దాన్నే రాజకీయ పరమైనదిగా వాడుకోవటం మరీ అన్యాయం.. దుర్మార్గం.(ఈ మాటలు చాలా అస్పష్టంగా ఉండటమే కాదు. సజ్జల మనసులో ఏదో ఉంది. దాన్ని పూర్తిగా చెప్పలేక.. అలా అని ప్రస్తావించలేక.. అస్పష్టంగా చెప్పిన ఆయన మాటలు మరింత కన్ఫ్యూజ్ చేసేలా ఉన్నాయి)
- సీబీఐ దగ్గర ఉన్న వాంగ్మూలాలన్నింటిని చూస్తే.. అవన్నీచదవాలంటే పెద్ద పెద్ద ఉద్గంధ్రాల మాదిరి ఉన్నాయి. ముఖ్యంగా సునీతమ్మది అయితే.. దఫాలు.. దఫాలు వెళ్లి సీబీఐ వద్దకు చెప్పారు. దానికి రైము.. రీజనింగ్ లేదు. జనరల్ గా 161 (ఐపీసీ సెక్షన్ 161) వాళ్లు పిలిచి అడగాలి. ఇన్సిడెంట్ గురించి ఉండాలి. నాకున్న కామన్ సెన్సుతో చెబుతున్నా. హత్య జరిగింది. హత్యకు సంబంధించిన అంశాలు చెప్పాలి. అంతగా అయితే కొత్తగా ఏమైనా కోణం ఉంటే.. అది కూడా ముందు ఎందుకు చెప్పలేదని కూడా సీబీఐ అడగాలి కదా. నాకు తెలిసి ఆమె నాలుగైదుసార్లు.. ఆరు సార్లు కొత్త పాయింట్లను సీబీఐ వద్దకు వెళ్లి.. తన వాంగ్మూలంలో చేర్చుకుంటూ చెప్పారు.