పంచాయతీ ఎన్నికల వివాదం సవాళ్ల దిశగా రూటు మార్చింది. పంచాయతీ ఎన్నికల తొలి దశకు సంబం ధించి.. టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల కిందట తాము.. వెయ్యికి పైగా పంచాయతీల్లో గెలుపు గుర్రం ఎక్కామని.. తమ మద్దతు దారులు.. అనేక నిర్బంధాలను కూడా తట్టుకుని గెలిచారని.. మీడియా ముఖంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన పేర్లు.. వెల్లడించకపోయినా.. కొన్ని ప్రాంతాల పేర్లను మాత్రం చెప్పుకొచ్చారు. అయితే.. ఈ విషయంలో వైసీపీ గట్టిగానే నిలబడింది. తూచ్.. చంద్రబాబు చెప్పేవన్నీ కాకమ్మ కబుర్లేనని.. కేవలం ఆ పార్టీ 510 పంచాయతీల్లో మాత్రమే గట్టెక్కిందని పేర్కొంది.
ఇదే విషయాన్ని తాజాగా పార్టీ సీనియర్ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సవాల్ చేశారు. మొత్తం తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో 3245 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించినట్టు సజ్జల తెలిపారు. వీటిలో 2616 పంచాతీల్లో వైసీపీ మద్దతు దారులు విజయం సాధించారని తెలిపారు. 24 మంది వైసీపీ రెబెల్స్ విజయం సాధించారని వెల్లడించారు. 510 పంచాయతీల్లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కిందన్నారు. మిగిలిన 94 స్థానాల్లో బీజేపీ-జనసేన సహా ఇతరులు విజయం సాదించారని సజ్జల వివరించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇక్కడే టీడీపీని సజ్జల గట్టిగా ఇరికించేశారు.
ఎన్నికలు ముగిసిన తెల్లారి అంటే ఈ నెల 10వ తారీకు చంద్రబాబు మీడియాతో మాట్లాడిన విషయాన్ని ఉదహరించిన సజ్జల.. దాదాపు వెయ్యికిపైగా పంచాయతీల్లో విజయం సాధించామన్న.. టీడీపీ వాటి లెక్క తేల్చాలని సవాల్ విసిరారు. వైసీపీ సాధించిన 2616 పంచాయతీల్లో సభ్యుల వివరాలను తాము నెట్లో అప్‌లో డ్ చేస్తున్నామని.. YSRCPPOLLS.INలో అందరి వివరాలను నియోజకవర్గాలు, పంచాయతీలు, మండలాల వారీగా ఫొటోలతో సహా అప్ లోడ్ చేస్తున్నామని.. వీటిలో ఎవరు టీడీపీ వారున్నా.. వెల్లడించాలని.. టీడీపీకి సవాల్ రువ్వారు. అంతేకాదు.. లేకపోతే.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తప్పని ఒప్పుకోవాలని అన్నారు. ఇక, ఈ మొత్తంగా పంచాయతీలో పాత్రికేయులే జడ్జిలుగా ఉండాలని కూడా ఆయన కోరడం విశేషం. మరి దీనిని టీడీపీ ఎలా తీసుకుంటుంది? ఏవిధంగా వైసీపీకి సమాధానం చెబుతుంది? అనేది వేచి చూడాలి.