జనసేనాని పవన్ కళ్యాణ్‌పై సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. గుంతలు పూడ్చి ఫొటోలు దిగితే శ్రమదానం అవుతుందా అని ప్రశ్నించారు. జనసేనకు దశ, దిశ, వ్యూహం కొరవడ్డాయన్న సజ్జల పబ్లిసిటీ పోరాటాలను పవన్ ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. అలాగే, బద్వేల్ ఎన్నిక కోసం పవన్ ఎవరితో కలసినా వైసీపీకి నష్టం లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అసలు ఎన్నకల్లో పోటీ చేయడానికి పవన్‌కు ఉన్న ఫ్యాక్టర్ ఎంత అని ప్రశ్నించారు. పవన్ పబ్లిసిటీ పోరాటాలు చెయ్యడం మానుకోవాలి.
కెమెరా అన్ చేసి యాక్షన్ అనగానే చెయ్యడానికి ఇది సినిమా కాదు. గోతులు పూడ్చి ఫోటోలు దిగి చేసే ఆందోళనల వల్ల ప్రయోజనం లేదని అన్నారు సజ్జల. రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం 2,200 కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేస్తున్నాం. చీప్ పబ్లిసిటి కోసం ఇలాంటి పనులు చెయ్యడం పవన్ కల్యాణ్ మానుకోవాలి. పవన్ స్థాయికి మేము దిగజారాల్సిన అవసరం లేదు. జనసేన దిశ లేకుండా ప్రయాణం చేస్తుంది. బద్వేల్ ఉప ఎన్నికలో జనసేన ఎవరితో కలిసిన నష్టం ఏమి లేదని తెలపాల్సింది. పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రంలో ఉండే వ్యక్తి అని, నాలుగు నెలలకు ఒకసారి వచ్చి కార్యక్రమాలు చేస్తే ఏం ఉపయోగం ఉంటుందని విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్‌కు భయపడి రోడ్లు వేశామని అనుకోవడం వారి భ్రమ అని, ఉలిక్కిపడాల్సిన అవసరం లేదని సజ్జల పేర్కొన్నారు.
ఇక ఇదిలా ఉంటే .. ఏపీలో రోడ్ల పరిస్థితిని నిరసిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం చేపట్టనున్న శ్రమదానం కార్యక్రమం వేదిక మారింది. నిరసన కార్యక్రమాన్ని తొలుత రాజమండ్రిలోని కాటన్ బ్యారేజీ దగ్గర నిర్వహించాలని నిర్ణయించింది. కానీ జలవనరుల శాఖ అధికారులు అనుమతి నిరాకరించడంతో వేదికను హుకుంపేటలోని బాలాజీపేటకు మార్చారు. బాలాజీపేట కనకదుర్గమ్మ గుడి వద్ద సభ అనంతరం రోడ్డుపై పవన్ శ్రమదానం చేయనున్నారు. తొలుత కాటన్ బ్యారేజీ పై పవన్ శ్రమదాన కార్యక్రమం ఉంటుందని జనసేన పార్టీ ప్రకటించింది.
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజి రోడ్డు మరమ్మతుల చేయాలని జనసేన భావించింది. కానీ ఇరిగేషన్ అధికారులు అనుమతి నిరాకరించారు. కారణాలను కూడా ఇరిగేషన్ ఎస్‌ఈ ప్రస్తావించారు. ఇది వరదల సమయమని.. గోదావరి ఉధృతంగా ఉందన్నారు అధికారులు. రేపోమాపో మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో ఇక్కడ ఎటువంటి అనుమతి ఇచ్చేది లేదన్నారు. జనసేన మాత్రం శ్రమదానం చేసి తీరతామని చెబుతోంది. విజయవాడలో పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
ఏపీలో రోడ్ల పరిస్థితిపై జనసేన పోరాడుతోంది. ప్రభుత్వం తాము విధించిన గడువులోగా స్పందించకపోతే స్వయంగా తానే రంగంలోకి దిగుతానని పవన్ గతంలోనే చెప్పారు. ఆ దిశగా పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జగన్ సర్కార్‌కు ఇచ్చిన డెడ్‌లైన్ ముగియడంతో నిరసనకు సిద్ధమయ్యారు. అక్టోబరు 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని ఏపీలోని రెండు ప్రాంతాల్లో శ్రమదానం చేయాలని పవన్ నిర్ణయించుకున్నారు.అక్టోబరు 2న ఉదయం 10 గంటలకు తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డుకు మరమ్మతులు చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం జిల్లా కొత్తచెరువు పంచాయతీ పరిధిలోని పుట్టపర్తి-ధర్మవరం రోడ్డు మరమ్మతులు కూడా నిర్వహించేందుకు సిద్దమయ్యారు.