సాక్షి కేసు - బోడిగుండుకు, మోకాలికి లింకు పెడుతున్న టీడీపీ!

Update: 2022-02-24 09:32 GMT
కేంద్ర హోం శాఖ జ‌గ‌న్ మీడియా సాక్షి ఛానెల్ ను ప్ర‌యివేటు ఛానెల్ లిస్టు నుంచి తొల‌గించ‌డంతో టీడీపీ మీడియా సంబ‌రాలు చేసుకుంటుంది. సాక్షి ఛానెల్ కు కేంద్ర హోం శాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వ‌క‌పోవ‌డంతో తాజాగా వివాదం నెల‌కొంది.దీనిని స‌వాలు చేస్తూ ఉద్యోగులు తెలంగాణ కోర్టును ఆశ్ర‌యించి ఉప‌శ‌మ‌నం పొందారు కూడా!కానీ టీడీపీ మీడియా మాత్రం అదొక పెద్ద త‌ప్పిదం అన్న‌విధంగా జ‌గ‌న్ కు చెందిన పాత కేసుల కార‌ణంగానే అక్ర‌మాస్తుల కేసుల కార‌ణంగానే లైసెన్సు రెన్యువ‌ల్ కాలేద‌ని, దాంతో ఛానెల్ ఆగిపోయే ప‌రిస్థితులు పుష్క‌లంగా ఉన్నాయ‌ని ఒక‌టే ప‌నిగా ఊద‌ర‌గొడుతోంది.

దీంతో వైసీపీ వ‌ర్గాలు సీన్ లోకి దిగాయి. కేంద్రంతో త‌మ‌కు చెడిందేమీ లేద‌ని, కొద్ది రోజులు ఆగితే స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని అంటోంది. గ‌తంలోనూ ఇదే విధంగా స‌మ‌స్య రేగింద‌ని, త‌రువాత ప‌రిష్కారం అయింద‌ని అంటోంది.

ఇక తెలంగాణ కోర్టు ఉత్త‌ర్వుల కార‌ణంగా ఛానెల్ ప్ర‌సారాలు అయితే ఆగిపోలేదు.క‌నుక టీడీపీ పెద్ద‌గా అంత‌ర్మ‌థ‌నం చెందాల్సిన ప‌నే లేదు. అదేవిధంగా కొద్ది రోజుల ప్ర‌తిష్టంభ‌న తొల‌గితే త‌రువాత ఛానెల్ కు ఢోకానే ఉండ‌దు.ముఖ్య‌మంత్రి ఛానెల్ సాక్షి ఏనాడూ క‌ల్లోలాలు రేప‌లేదు.

మ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌కు లేదా దేశ భ‌ద్ర‌త‌త‌కు విఘాతం క‌లిగించే ప‌నులు ఏవీ చేయ‌లేదు.ఛానెల్ పెట్టుబ‌డుల‌న్నీ ఆ రోజు వైఎస్సార్ పై ప్రేమ‌తో వ‌చ్చిన‌వే! ఒక‌వేళ క్విడ్ ప్రోకో లో భాగంగా వ‌చ్చినా కూడా వాటిని కూడా నిరూపించేందుకు ద‌ర్యాప్తు సంస్థ‌లున్నాయి.ఆ రోజు ఛానెల్లో వాటాలు కొనుగోలు చేసిన కొంద‌రు త‌రువాత కాలంలో త‌ప్పుకున్నారు కూడా! క‌నుక అక్ర‌మాస్తుల కార‌ణంగానే ఛానెల్ నిలిపివేయాల‌ని కేంద్రం చెప్ప‌దు.చెప్ప‌బోదు.అలా అయితే స‌న్ నెట్ వ‌ర్క్ కూడా ఎప్పుడో ఆపేయాలి.వాళ్ల త‌ర‌ఫున మ‌నుషులు కూడా ఎప్ప‌టి నుంచో 2జీస్పెక్ట్రం కేసులో ఉన్నారు. ద‌యానిధి మార‌న్, క‌ళా నిధి మార‌న్ లు ఆ రోజు కుంభ‌కోణంలో నిందితులు అన్న విష‌యం మ‌రిచిపోయి టీడీపీ మీడియా సంబ‌ర‌ప‌డిపోవ‌డం త‌గ‌దు.
Tags:    

Similar News