హిందువులకు మద్దతు ఇవ్వడంలో భాగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే బీజేపీ ఎంపీ సాక్షీ మహారాజ్ తను ఎవరి మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎంపీ సాక్షీ మహారాజ్ మాట్లాడుతూ ముగ్గురు భార్యలు - నలభై మంది పిల్లలు ఉన్నవారి వల్లే జనాభా పెరిగిపోతోందని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లు రచ్చ రచ్చగా మారాయి. ఈ క్రమంలో రంగ ప్రవేశం చేసిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల సంఘం ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఎంపీని ఆదేశించింది. దీంతో సాక్షి మహారాజ్ వివరణ ఇచ్చారు.
దేశంలో జనాభా ఆందోళనకర రీతిలో పెరిగిపోతోందనే తాను వ్యాఖ్యానించాను తప్ప మరో ఉద్దేశం లేదని ఎన్నికల సంఘం గమనించాలని సాక్షి మహారాజ్ తెలిపారు. తన ప్రసంగ వీడియోలను ఒకసారి సమీక్షించాలని, ఏ వర్గానికి చెందిన వాళ్లపై తాను కామెంట్స్ చేయలేదని ఎంపీ సాక్షి మహారాజ్ అన్నారు. తనకు హిందీలో నోటీసు ఇవ్వాలని కోరినట్లు ఎంపీ చెప్పారు. ఇదిలాఉండగా సాక్షి మహారాజ్ వ్యాఖ్యలపై ఉత్తర్ ప్రదేశ్ లో అధికార పార్టీ అయిన సమాజ్ వాదితో పాటు విపక్షాలైన బీఎస్పీ, కాంగ్రెస్‌లు సైతం మండిపడ్డాయి. విద్వేషాలు రెచ్చగొట్టేలా కామెంట్లు చేయడమే కాకుండా ఒక మతం వారిని అవమానించేలా ఉన్నాయని ద్వజమెత్తాయి. ఈ క్రమంలో ఈసీ రంగంలోకి దిగి సాక్షి మహారాజ్ వివరణ కోరింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/