'సాక్షి' కి మూడో స్థానం చెప్పే అర్థం ఇదేన‌ట‌!

Update: 2019-04-05 03:38 GMT
ఆస‌క్తిక‌ర అంశం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. టీవీ చాన‌ళ్ల ప్రేక్ష‌కాద‌ర‌ణకు త‌గ్గ‌ట్లుగా వాటికి ర్యాంకులు నిర్దేశించ‌టం ఎప్ప‌టి నుంచో వ‌స్తున్న‌దే. తెలుగు న్యూస్ చాన‌ళ్ల విష‌యానికి వ‌స్తే.. టీవీ 9 అగ్ర‌స్థానంలో ఏళ్ల‌కు ఏళ్లుగా కొన‌సాగుతోంది. అప్పుడ‌ప్పుడు దాని అధిక్యాన్ని ప్ర‌శ్నించేలా ఎన్ టీవీ.. టీవీ 5.. వీ 6 చాన‌ళ్లు అప్పుడ‌ప్పుడు మొద‌టి స్థానాన్ని చేజిక్కించుకుంటాయి. కానీ.. ఆ స్థానంలో ఎక్కువ సేపు ఉండ‌లేక మ‌ళ్లీ టీవీ9కి అప్ప‌గిస్తూ ఉంటాయి.

ఇలా చూసిన‌ప్పుడు టీవీ 9 తొలిస్థానంలో.. ఎన్ టీవీ.. టీవీ 5లు రెండు మూడుస్థానాల్ని త‌ర‌చూ మార్చుకుంటూ ఉంటాయి. ఇక‌.. సాక్షి.. 10 టీవీ.. హెచ్ ఎం టీవీ.. ఎబీఎన్ చాన‌ళ్లు కింద స్థానాల్లో నిలుస్తూ ఉంటాయి. తాజాగా టీవీ చాన‌ళ్ల ర్యాంకింగ్‌లో చోటు చేసుకున్న మార్పు ఆస‌క్తిక‌రంగానే కాదు.. ఏపీ భ‌విష్య‌త్ రాజ‌కీయాలు ఎలా ఉంటాయ‌న్న విష‌యాన్ని చెప్పేలా ఉన్న‌ట్లు చెబుతున్నారు.

ఐదో స్థానంలో ఉన్న సాక్షి చాన‌ల్.. హ‌టాత్తుగా త‌న స్థానాన్ని చేజార్చుకుంది. కీల‌క ఎన్నిక‌ల వేళ‌.. ఇలా జ‌రిగిందేమిట‌న్న కంగారు అక్క‌ర్లేదు. ఎందుకంటే.. ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకోవ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఏపీలో మారుతున్న రాజ‌కీయ ప‌రిస్థితికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా తాజా రేటింగ్ అన్న మాట వినిపిస్తోంది.

ఏపీలో జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల్ని.. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల్ని.. రోడ్ షోల‌కు సంబంధించిన స‌మాచారాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ఎక్కువ‌గా చూస్తున్నార‌ని.. ఇదే సాక్షి టీఆర్పీ రేటింగ్‌ను పెరిగేలా చేసిందంటున్నారు. రానున్న రోజుల్లో ఏపీలో జ‌రిగే ఎన్నిక‌ల్లో తుది ఫ‌లితాన్ని తాజాగా మారిన సాక్షి చాన‌ల్‌ స్థానంతో చెప్ప‌క‌నే చెప్పేయొచ్చంటున్నారు.  

Tags:    

Similar News