జీతం అంటే నెల రోజుల దాకా ఎదురుచూడాలి. ముప్పయి రోజులు పెను ముప్పుగా మారెనే. అప్పులు పాలు అయ్యెనే అని గొణిగేవారున్నారు. అలాగే, బతుకు బరువై అరువుతో కరువుతో రోజులు సాగెనే అని విషాద గీతాన్ని సదా వేతన జీవులు ఆలపిస్తూ వెతలతో సతమతమవుతారు. ఎపుడు వస్తుందిరా ఫస్ట్ తారీఖు అని కూడా రోజూ క్యాలండర్ అని అలా అటూ ఇటూ తిప్పేస్తూంటారు. అలాంటిది ఉద్యోగులకు, వేతన జీవులకు వారానికి ఒకసారి జీతాలు అంటే ఎలా ఉంటుంది.
చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అంతే కాదు, వారిలో సరికొత్త ఉత్సాహం కూడా వెల్లి విరుస్తుంది కదా. సరిగ్గా ఈ పాయింట్స్ నే పట్టుకుని దేశంలో తొలిసారి ఒక కార్పోరేట్ సంస్థ దీని మీద ప్రయోగం చేయబోతోందిట. ఇండియన్ మార్ట్ సంస్థలో ఇక నెల జీతాలకు స్వస్తి పలకబోతున్నారుట.
ఇక మీదట ఏ వారానికి ఆ వారమే జీతాలు చెల్లించాలని ఇండియా మార్ట్ యాజమన్యం గట్టిగా డిసైడ్ అయింది. దీని వల్ల ఉద్యోగుల ఆర్ధిక ఇబ్బందులు బాగా తగ్గుతాయని కూడా ఇండియా మార్ట్ సంస్థ యాజమాన్యం అంచనా వేస్తోంది.
ఉద్యోగి ఆర్ధికంగా చికాకులు లేనపుడు మనసు పెట్టి సంస్థ శ్రేయస్సు కోసం పనిచేస్తాడు అని కంపెనీ ఆశిస్తోంది. దీని వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయని కూడా ఊహిస్తున్నారు. ఒక విధంగా ఇది మంచి విధానమే అని ఆర్ధిక నిపుణులు కూడా అంటున్నారు.
నెల జీతగాళ్ళకు మనసు ఎపుడూ ఆర్ధికపరమైన ఆలోచనల్లో ఉంటే కచ్చితంగా వారు పని మీద దృష్టి నిలపలేరు. ఇది పలు అధ్యయనాల్లో రుజువు అయింది. అలా కాకుండా వారి ఈతి బాధలను కనుక పట్టించుకున్న చోట సంస్థ కూడా మరింతగా రాణిస్తుంది అని అంటున్నారు.
ఇప్పటికే న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, అమెరికా వంటి దేశాలలో వారానికి ఒకసారి జీతాలు ఇచ్చే విధానం అమలులో ఉంది. దీని వల్ల అక్కడ కంపెనీలు మంచి లాభాలు కూడా కళ్ళ చూస్తున్నాయట. మరి ఇండియా మార్ట్ సంస్థ దేశంలో తొలిసారి ఈ ప్రయోగం చేస్తోంది. ఇది కనుక సక్సెస్ అయితే మిగిలిన వారు కూడా ఇదే బాటలో నడిచే వీలు ఉంది అంటున్నారు.
ఇక్కడ మరో విషయం కూడా ఉంది. వారానికి ఒకసారి అంటే జేబు కూడా బరువుతోనే ఎపుడూ ఉంటుంది.అది మనిషి మానసిక ఉల్లాసానికి కూడా ఒక టానిక్ గా పనిచేస్తుంది అని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నాడు. ధన మూలం ఇదం జగత్ అన్న సూక్తి ఎటూ ఉంది. అందువల్ల డబ్బుతోనే ఏ జబ్బు కూడా దరి చేరకుండా ఉంటుంది.
అదే విధంగా ఒకేసారి డబ్బులు రావడం అలా తెలియకుండా ఖర్చు రూపంలో వెళ్ళిపోవడం కంటే విడతల వారిగా ధన ప్రవాహం జరుగుతూ ఉంటే మార్కెటింగ్ వ్యవస్థకు కూడా అది ఊతమిస్తుంది అంటున్నారు. మరి మెల్లగా మొదలైన ఈ వారంతపు జీతాల ప్రయోగం దేశంలో విస్తరించి స్థిరపడుతుంది అని భావించవచ్చా అంటే అవును అనే జవాబు వస్తోంది.