అమ‌రావ‌తిలో లిక్క‌ర్ ఇప్పుడు బ్లాక్ లో..

Update: 2017-07-04 05:11 GMT
ఏపీలో మందుబాబుల‌కు పెద్ద క‌ష్ట‌మే వ‌చ్చి ప‌డింది. నిన్న‌టి వ‌ర‌కూ ఎంచ‌క్కా ఎక్క‌డ కావాలంటే అక్క‌డ మందు తాగేసే అద్భుత అవ‌కాశాన్ని మిస్ చేయ‌టంపై వారు విరుచుకుప‌డుతున్నారు. ఏపీలో మొత్తం 4363 వైన్ షాపులు ఉండ‌గా.. సోమ‌వారానికి 1638 వైన్ షాపులు మాత్ర‌మే తెరుచుకున్నాయి. లైసెన్స్ ఫీజులు క‌ట్టినా స్థ‌లాలు దొర‌క్క‌పోవ‌టం.. ఇటీవ‌ల అమ‌ల్లోకి వ‌చ్చిన సుప్రీం ఆదేశాల నేప‌థ్యంలో మందు షాపుల్ని మూసేస్తున్నారు.

నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ఉన్న మద్యం దుకాణాల్ని మూసివేయ‌టంతో.. మ‌ద్యం కొర‌త ఏపీలో పెరిగింది. మ‌రి ముఖ్యంగా ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో మ‌ద్యం ఇప్పుడు బ్లాక్ లో మాత్ర‌మే ల‌భ్య‌మ‌వుతోంది.

రూల్ ప్ర‌కారం అమ్మాల్సిన  దాని కంటే రూ.50 ఎక్కువ పెట్టి అమ్మేస్తున్నారు. మందు దొర‌క‌ని రోజుల్లో కాస్త భార‌మైనా.. అద‌నంగా డ‌బ్బులు చెల్లించి మ‌రీ కొనుగోలు చేస్తున్నారు. త‌మ‌పై అద‌నంగా ప‌డిన భారంపై మందుబాబులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌ద్యానికి కృత్రిమ డిమాండ్ క‌లిగిస్తున్నార‌ని.. ద‌ళారులు బాగుప‌డేట‌ట్లుగా ప్ర‌భుత్వం వ‌హ‌రిస్తుంద‌న్న వాద‌న‌ను వినిపిస్తున్నారు. మ‌ద్యాన్ని అధిక ధ‌ర‌ల‌కు అమ్ముతున్న వారిపై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌టం లేద‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. పెద్ద ఎత్తున మద్యం దుకాణాలు మూసి వేయ‌టంతో తెరిచి ఉన్న కొన్ని షాపులు కిక్కిరిసిపోతున్నాయి. మ‌ద్యం కోసం బారులు తీరుతున్నారు. దీంతో.. మ‌ద్యం షాపుల వారు సైతం ధ‌ర‌లు పెంచి అమ్మ‌టం క‌నిపిస్తోంది. ఒక్కో బాటిల్ మీద రూ.50కు త‌గ్గ‌కుండా బాదేస్తున్నార‌ని.. ఇది ఏ మాత్రం స‌రికాద‌ని మండిప‌డుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News