కాలం మారింది. రోజులు మారాయి. రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి. ప్రజలే ప్రభువులుగా మారిన రోజులు వచ్చాయి. ప్రజా ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న వేళలోనూ కొన్ని దేశాల్లో మాత్రం రాజులు.. రాజరికాలదే రాజ్యాధికారం. ప్రపంచంలోని రాజరిక దేశాల్లో మోస్ట్ పవర్ ఫుల్ రాజుగా సౌదీ అరేబియా రాజును చెప్పాలి. 84 ఏళ్ల కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ప్రభావవంతమైన రాజుగా అభివర్ణిస్తారు.
సౌదీలో అనేక సంస్కరణలకు ఆయనే కారణం. ఇదే సౌదీని మిగిలిన దేశాల కంటే పవర్ ఫుల్ గా తయారయ్యేలా చేసింది. తన మాట వినని వారి సంగతి చూసే అలవాటు ఆయనకు కొత్తేం కాదు. తన కుటుంబ సభ్యుల్ని సైతం మొహమాటం లేకుండా ఖైదు చేయించటం తెలిసిందే. తనకు వ్యతిరేకంగా గళం విప్పే వారి సంగతి ఆయన ఒక కంట కనిపెడుతూనే ఉంటారు.
తాజాగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. పిత్తాశయం వాపుతో బాధ పడుతున్న ఆయన రాజధాని రియాద్ లోని ఆసుపత్రిలో చేరినట్లుగా చెబుతున్నారు. అబ్దుల్ అజీజ్ తన కుమారుడు మహమ్మద్ బిన్ సల్మాన్ ను యువరాజుగా ప్రకటించినప్పటికీ ప్రజలు.. దేశాధినేతలు మాత్రం అబ్దుల్ అజీజ్ నే సుప్రీంగా భావిస్తుంటారు. 2016లో కొడుక్కి రాజ్యాధికారం అప్పగించినప్పటికీ.. కీలక నిర్ణయాల్లో మాత్రం ఆయనే కథ నడిపిస్తుంటారన్న మాట వినిపిస్తుంటుంది.