అప్పుడు కారును జింక డ్రైవ్ చేసిందా?

Update: 2015-12-17 06:00 GMT
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను వెంటాడి వేధించిన హిట్ అండ్ రన్ కేసును ఈ మధ్యనే కోర్టు కొట్టేయటం తెలిసిందే. దీనిపై సామాజిక వెబ్ సైట్లలో నెటిజన్లు ఓ రేంజ్ లో వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఈ విమర్శల పర్వం సోషల్ మీడియాలోనే కాదు.. లోక్ సభలోనూ చర్చకు వచ్చాయి. సల్మాన్ కేసుకు సంబంధించి బీజేపీ.. శివసేన పక్ష నేతలు వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ నిర్దోషి అయిత.. పేవ్ మెంట్ మీద పడుకొని మరణించిన వ్యక్తి సంగతి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. సల్మాన్ నిర్దోషి అయిన పక్షంలో మరణించిన వ్యక్తి మాటేమిటని? అతన్ని ఎవరు చంపారు? అతను ఎందుకు మరణించారన్నది ఇప్పుదు సందేహంగా మారింది.

తాజాగా పార్లమెంలో ఇదే అంశంపై చర్చ  జరిగింది. బీజేపీ ఎంపీతో పాటు  శివసేన  ఎంపీకి చాలానే ప్రశ్నలు వచ్చాయి. వీటిపై గళం విప్పిన నేతలు.. శివసేనకు చెందిన వినాయక్ రౌత.. బీజేపీకి చెందిన కీర్తి అజాద్ లు సల్మాన్ ఉదంతాన్ని ప్రస్తావించారు. కమర్షియల్ కోర్టుల చర్చ సందర్భంగా సల్మాన్ హిట్ అండ్ రన్ ప్రస్తావన వచ్చింది. పేవ్ మెంట్ మీద పడుకొని మరణించిన వ్యక్తిని చంపిందెవరు? అని సూటిగా ప్రశ్నించారు. న్యాయవ్యవస్థపై విమర్శలు సంధించిన వారు.. పేమ్ మెంట్ మీదకు కారును దూసుకొచ్చిన సందర్భంలో కారును జింక డ్రైవ్ చేసి ఉండొచ్చంటూ వ్యాఖ్యలు చేశారు.

మన న్యాయవ్యవస్థ తీరు ఎలా ఉందంటే.. 12 ఏళ్ల తర్వాత సల్మాన్ నిర్దోషిగా బయటపడ్డారని.. మరి ఆ రోజున ప్రమాదంలో మరణించిన దానికి బాధ్యులు  ఎవరంటూ ప్రశ్నించారు. ఆ మరణానికి కారణం ఎవరు? పేదవాడి మరణానికి కారకుల్ని వెతికే పని ఎందుకు జరగలేదు? ఆ చావు జవాబు లేని ప్రశ్నగా ఉండిపోవాల్సిన విధంగా న్యాయవ్యవస్థ ఉండటం సరైనదేనా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఒక వ్యంగ్య వ్యాఖ్య చేశారు. చట్టం తెలిసిన లాయర్ మంచి లాయర్ అని.. జడ్జి తెలిసిన లాయర్ గొప్ప లాయర్ అంటూ వ్యాఖ్యానించారు. జింకను చంపినోడు జైలుకు వెళ్తుంటే.. మనిషిని చంపినోడు మాత్రం నిర్దోషిగా బయటపడుతున్నారంటూ తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు.
Tags:    

Similar News