కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. తీర్పు వెలువడిన అనంతరం సల్మాన్ ను జోథ్ పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సల్మాన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. అయితే, అనూహ్యంగా సల్మాన్ కేసును విచారిస్తున్న జోథ్ పూర్ సెషన్స్ కోర్టు జడ్జి రవీంద్రకుమార్ జోషి బదిలీ కావడంతో సల్మాన్ కు బెయిల్ రావడం ఆలస్యమవుతుందని అంతా భావించారు. అయితే, తాజాగా, సల్మాన్ కు షరతులతో కూడిన బెయిల్ ని జోథ్ పూర్ సెషన్స్ కోర్టు మంజూరు చేసింది. రూ.50 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
రాజస్థాన్ వ్యాప్తంగా 87 మంది జిల్లా జడ్జిలను బదిలీ చేశారు. ఆ జడ్డిలలో జోథ్ పూర్ సెషన్స్ కోర్టు జడ్జి రవీంద్రకుమార్ జోషి కూడా ఉన్నారు. బదిలీ అయిన జడ్జి డీల్ చేసిన కేసును వేరే జడ్జి విచారణ చేసే అవకాశం లేకపోవడంతో సల్మాన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను తీర్పును రిజర్వ్ చేశారు. దీంతో, సల్మాన్ కొద్ది రోజుల పాటు జోథ్ పూర్ జైల్లో ఉండాల్సి వస్తుందని అంతా భావించారు. అయితే, సల్మాన్ కు ఊరటనిస్తూ షరతులతో కూడిన బెయిల్ ని జోథ్ పూర్ సెషన్స్ కోర్టు మంజూరు చేసింది. అయితే, జైలు అధికారులకు బెయిల్ ఆర్డర్ అందిన తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ ఫార్మాలిటీస్, పూర్తవడానికి కొద్దిగా సమయం పట్టే అవకాశముంది. ఆ వ్యవహారాలు పూర్తయ్యాక ఈరోజు రాత్రి 7.30కు సల్మాన్ విడుదల అయ్యే అవకాశముందని సీనియర్ న్యాయవాది భరత్ భూషణ్ శర్మ తెలిపారు.