ప్రముఖ బాలీవుడ్ నటుడు డిసెంబరు 10ని మర్చిపోలేరేమో. దాదాపు పుష్కర కాలానికి పైగా వెంటాడుతున్న కేసు నేటితో ముగిసినట్లే. నిర్లక్ష్యంగా కారు నడిపి.. ఒకరి మృతికి కారణమైన కేసులో నిందితుడి ఉన్న ఆయన్ను దోషిగా నిర్దారించలేమంటూ బాంబే హైకోర్టు పేర్కొంది.
హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ను దోషిని భావించలేమని పేర్కొనటం.. ఆయనకు పెద్ద ఊరట కానుంది. ఇదే కేసులో బాంబే స్థానిక కోర్టు 5 ఏళ్లు జైలుశిక్ష.. జరిమానా విధించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ కొద్ది నెలల క్రితం హైకోర్టును ఆశ్రయించిన సల్మాన్.. తాజాగా వచ్చిన తీర్పుతో ఈ కేసు నుంచి విముక్తం కానున్నారు. కారుతో ఢీ కొట్టిన ఘటనలో సల్మాన్ ను దోషిగా నిర్దారించలేమని.. అందుకు తగిన వాదనలు వినిపించటం.. ఆధారాల్ని చూపించటంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లుగా బాంబే హైకోర్టు ప్రకటించింది. తాజా తీర్పు నేపథ్యంలో హిట్ అండ్ రన్ కేసు నుంచి సల్మాన్ బయటపడినట్లే.