మాజీ కేంద్రమంత్రి చిదంబరానికి ఊహించని పంచ్ పడింది. టైమ్స్ లిటరరీ ఫంక్షన్ లో ప్రసంగించిన సందర్భంగా చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు కొన్ని చేశారు. కాంగ్రెస్ పార్టీకి.. మరి ముఖ్యంగా గాంధీ కుటుంబానికి వీర విధేయుడైన ఆయన.. గతంలో మాజీ ప్రధానులు ఇందిర.. రాజీవ్ లు చేసిన తప్పుల్ని ప్రస్తావించటం తెలిసిందే. ఇందిర అత్యయిక పరిస్థితి విధించి తప్పు చేస్తే.. రాజీవ్ సాల్మన్ రష్దీ పుస్తకాన్ని బ్యాన్ చేశారంటూ వ్యాఖ్యానించారు.
చిదంబరం వ్యాఖ్యల నేపథ్యంలో శటానిక్ వర్సెస్ పుస్తక రచయిత సాల్మన్ రష్ధీ ట్వీట్ తో స్పందించారు. తాము చేసిన తప్పును ఒప్పుకోవటానికి 27 ఏళ్లు పట్టిందని.. మరి.. దాన్న సరిదిద్దుకోవటానికి ఇంకెన్ని ఏళ్లు పడుతుందని ప్రశ్నించారు.
తాజాగా ట్వీట్ చేసిన రష్దీ.. ‘‘తప్పును అంగీకరించటానికి 27 ఏళ్లు పట్టింది. ఇక ఆ తప్పును సరిదిద్దుకోవటానికి మరెంత కాలం పడుతుంది?’’ అంటూ సూటిగా ప్రశ్నించారు. దివంగత రాజీవ్ అంత తప్పే చేసి ఉంటే.. పదేళ్లు నాన్ స్టాప్ గా అధికారంలో ఉన్న యూపీఏ హయాంలో.. కీలక స్థానాల్లో ఉన్న చిదంబరం ఎందుకు సరిచేసే ప్రయత్నం ఎందుకు చేయలేదో? అన్నది ఒక ప్రశ్న. ఇప్పుడు అలాంటి ప్రశ్నే రష్ధీ నోటి నుంచి రావటం గమనార్హం. మరి.. రష్దీ ట్వీట్ షాక్ కు చిదంబరం తంబి స్పందిస్తారా?