ఈ నిషేధం మీరెక్కడైనా చూశారా..?

Update: 2015-09-25 22:30 GMT
లైఫ్ స్టైల్ వ్యాధుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉంది. అయితే.... వీటికి సంబంధించి వ్యక్తిగతంగా ఎవరకు వారే జాగ్రత్తలు తీసుకుంటున్నారు కానీ ప్రభుత్వాల వైపు నుంచి జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం ఎక్కడా కనిపించదు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనూ వీటిపై సర్కారీ స్పందన తక్కువే. సభలు - సదస్సులు - సమావేశాలు నిర్వహించడం.. పరిశోధనలకు నిధులివ్వడం.. ప్రజలకు జాగ్రత్తలు చెప్పడం మినహా విప్లవాత్మక చర్యలు తీసుకోవడం మాత్ర తక్కువే. తాజాగా విప్లవాలకు చిరునామా అయిన ఓ దేశం అలాంటి విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది... వంటలకే ఆయువు పట్టయిన పదార్థంపై నిషేధం విధించింది... పరిమితులు పెట్టింది. వినడానికి విచిత్రంగా ఉన్నా ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. బొలీవియాలో ఈ నిషేధం విధించారు... ఇంతకీ నిషేధిత వస్తువు ఏంటో తెలుసా....!!!! ఉప్పు.

ప్రపంచవ్యాప్తంగా ఏ ఖండమైనా, ఏ దేశమైనా ఉప్పు లేనిదే వంట పూర్తికాదు. మోతాదులో కాస్త తేడా ఉండొచ్చేమో కానీ ఉప్పు లేనిదే వంటలకు రుచి రాదు. అయితే... ఆ ఉప్పే ప్రజల ఆరోగ్యానికి ముప్పు తెస్తుండడంతో బొలీవియాలో దానిపై నిషేధం విధించారు. ఇది ప్రజల వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం కానప్పటికీ నియంత్రిత, పరిమిత వినియోగం దిశగా నిషేధ నిబంధనలు రూపొందించారు. ప్రజల్లో ఉప్పు వినియోగాన్ని తగ్గించేందుకు వీలుగా రెస్టారెంట్లలో ఉప్పు వాడకంపై ఈ నిషేధం విధించాలని బొలీవియా ప్రభుత్వం నిర్ణయించింది. బొలీవియా ప్రజల్లో దాదాపు 35 శాతం మంది హైబీపీతో బాధపడుతున్నారట...  ఇందుకు ఉప్పు వినియోగం పెరిగిపోవటమేనని కారణమని గుర్తించిన ప్రభుత్వం రెస్టారెంట్లలో ఉప్పు వినియోగంపై నిషేధం విధించిది. ఇకపై రెస్టారెంట్ లు వినియోగ దారులకు అందచేసే ఆహార పదార్ధాలలో ఎంత మేర ఉప్పు - చక్కెర ఉందో బోర్డులు ఏర్పాటు చేసి ప్రకటించాలి. దీనిపై నిత్యం ఆహార విభాగం తనిఖీలు కూడా ఉంటాయట. ప్రపంచంలో ఉప్పును నిషేధించిన తొలి దేశం కూడా బొలీవియాయేనని చెబుతున్నారు.
Tags:    

Similar News