సీఎం కేసీఆర్ గిఫ్ట్..వారి ఖాతాల్లోకి రూ.5వేలు !

Update: 2020-04-10 09:10 GMT
క‌రోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళింది. కేంద్రం ప్ర‌క‌టించిన లాక్‌ డౌన్ తో దేశంలోని ప్రజలందరినీ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీనితో  రోడ్లు - వీధులు నిర్మానుష్యంగా మారాయి. మ‌హ‌మ్మారి  కరోనా పంజా నుంచి త‌ప్పించుకోవ‌టానికి ప్ర‌జ‌లు గ‌డ‌ప‌ దాట‌కుండా జాగ్ర‌త్త‌ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కానీ , ఇలాంటి క్లిష్టమైన సమయంలో కూడా కానీ వాళ్లు మాత్రం నిరంతరం శ్రమిస్తున్నారు. రోడ్లను ఊడుస్తూ - వీధులను - గల్లీలను శుభ్రం చేస్తున్నారు. వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ప‌క‌డ్బందీగా అమ‌లు చేస్తున్నారు.

వారి కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ వారికి ప్రోత్సాహకం అందిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. వారికి చేతులెత్తి దండం పెట్టిన సీఎం.. జీహెచ్‌ ఎంసీ - హెచ్‌ ఎండబ్ల్యూఎస్‌ డబ్ల్యూలో పనిచేస్తున్న వారికి రూ.7500 - గ్రామపంచాయతీలు - మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న వారికి రూ.5వేలు ఇస్తానని చెప్పారు. అన్నట్లుగానే సీఎం స్పెషల్ ఇన్సెంటివ్ నిధులు విడుదలయ్యాయి. ప్రతి కార్మికుడి ఖాతాల్లోకి నేటి నుంచి రూ.5వేలు జమకానున్నాయి.  దాని కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.21.84 కోట్లు విడుదల చేసింది.

గ్రామ పంచాయతీల్లో సఫాయి కర్మచారులు 43,661 మంది - మునిసి పాలిటీల్లో 21,531మంది - హైదరాబాద్‌ వాటర్‌ వర్క్స్‌ అండ్‌ సేవరేజ్‌ బోర్డులో 2510, జీహెచ్‌ ఎంసీలో 20690 మంది.. మొత్తం 95,392 మంది పనిచేస్తున్నారు. వారందరికీ ఈ  సీఎం గిఫ్ట్ అందనుంది.  వారి జీతాల్లోనూ కోత పెట్టకుండా చర్యలు తీసుకున్నారు. దీనితో కాస్త సమయంలో కూడా తమ కష్టాన్ని గుర్తించి సాయం చేస్తున్న సీఎం కేసీఆర్ కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
Tags:    

Similar News