ములాయం పైర్ః కుట్ర వెన‌క అతను..మంత్రి క్లారిటీ

Update: 2017-01-09 13:55 GMT
స‌మాజ్‌వాదీ పార్టీలో జ‌రుగుతున్న రాజ‌కీయాల్లో కొత్త ప‌రిణామం. ఎస్పీలో జరుగుతోన్న గొడవల వెనుక ఓ వ్యక్తి ఉన్నాడని సమాజ్ వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ ఆరోపించారు. పార్టీలో ఓ సమస్య వచ్చిపడిందన్నారు. ఇవాళ సైకిల్ గుర్తు కోసం అఫిడెవిట్ సమర్పించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంకు వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు తన కుమారునికి మధ్య ఎలాంటి వివాదం లేదన్నారు. త్వరలో తమ పార్టీలో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ములాయం కుమారుడు - యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ తండ్రితో వచ్చిన వైరం కారణంగా ఎస్పీని చీల్చిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిస్తూ ములాయం పై వ్యాఖ్యలు చేశారు.

ఇదిలాఉండ‌గా... ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్ - ఆయన కుమారుడు - యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ మధ్య నెలకొన్న వివాదంలో అజంఖాన్ మధ్యవర్తిత్వం నెరపుతోన్న విషయం తెలిసిందే. ఈమేరకు ఈ అంశంపై ఇవాళ ఆయన స్పందించారు. తాను అప్పుడు, ఇప్పుడు ఇరువురి మధ్య వారధిగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ వారధి మధ్య కొంచెం పొగమంచు కమ్ముకున్న మాట వాస్తవమేకానీ, పూర్తిగా అంధకారం మాత్రం లేదన్నారు. పార్టీపై పట్టు విషయంలో ములాయం - అఖిలేష్ మధ్య ఏర్పడిన వివాదం సమయంలో అజంఖాన్ మధ్యవర్తిగా వ్యవహరించి ఇరువురి మద్య ఏర్పడిన వివాదాన్ని సద్దుమణిగేలా చేశారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News