అసెంబ్లీ ఎన్నికల ముందర ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష వైసీపీకి కాలం కలిసివస్తోంది... అధికార టీడీపీని కాదని నేతలు - ప్రముఖులు వైసీపీలో చేరేందుకు క్యూలు కడుతున్నారు. టీడీపీ ఎన్ని పథకాలు ప్రకటించినా.. ఎంత మభ్యపెడుతున్నా కూడా క్షేత్రస్థాయిలో బలాన్ని అంచనావేస్తున్న నేతలు వైసీపీలో చేరేందుకు వస్తున్నారు..
తాజాగా ఏపీ డీజీపీగా పనిచేసిన నండూరి సాంబశివరావు వైసీపీలో చేరుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. జగన్ పాదయాత్ర సమయంలో మాజీ డీజీపీ సాంబశివరావు వెళ్లి కలిసారు. జగన్ ను కలిసినందుకు ఏపీసీఎం చంద్రబాబు మాజీ డీజీపీ సాంబశివరావును వివరణ కోరారు. కేవలం మర్యాద పూర్వకంగానే తాను పనిచేసే చోటకు వచ్చినందునే కలిశానని సాంబశివరావు అప్పుడు వివరణ ఇచ్చారు. అప్పట్లోనే పార్టీలో చేరుతున్నారన్న వార్తలు వచ్చాయి. కానీ దాన్ని ఆయన ఖండించారు. తాజాగా వైసీపీలో చేరేందుకు మాజీ డీజీపీ రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ఇప్పుడు మాత్రం ఎన్నికల వేళ.. ఆయన వైసీపీలో చేరబోతున్నారని వైసీపీ నేతలు చెబుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన సాంబశివరావు ఆ జిల్లా నుంచే పోటీకి ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం.
టీడీపీ మంత్రి అఖిలప్రియకు జగన్ షాక్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వైసీపీ నుంచి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లిన అఖిలప్రియపై అక్కడి టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు.. వారంతా వైసీపీలో చేరుతున్నారు. ఆళ్లగడ్డ టీడీపీలో సుధీర్ఘకాలంగా ఉన్న ఇరిగినేని రాంపుల్లారెడ్డి సోదరులు జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. వారు మంత్రి అఖిలప్రియ అవినీతికి పాల్పడుతున్నారంటూ అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ ఆళ్లగడ్డ ఇన్ చార్జిగా పనిచేసిన ఇరిగెల పార్టీలో కీలక నేతగా ఎదిగారు.అయితే మంత్రి అఖిలప్రియతో విభేదాల కారణంగా టీడీపీకి దూరంగా జరిగారు. ఇప్పుడు వైసీపీలో చేరనున్నారు. మంత్రి అఖిలకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఒక్కటవ్వడం.. మూకుమ్మడిగా వైసీపీలో చేరడంతో అక్కడ వైసీపీ బలం పెరిగిపోగా.. అఖిలప్రియకు వచ్చే ఎన్నికల్లో గడ్డుకాలం ఎదురవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ పరిస్థితుల దృష్ట్యా వచ్చేసారి చంద్రబాబు అఖిలప్రియకు కాకుండా ఆమె ప్రత్యర్థి ఏవీ సుబ్బారెడ్డికి టికెట్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని స్థానిక నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.