తుమ్మిళ్ల బ్యారేజ్ శంకుస్థాపన సందర్భంగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం కంటే...రాజకీయాలకు వేదికగా మారిన సంగతి తెలిసిందే. మంత్రి హరీశ్ రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశంసలు గుప్పించడం - ఆయనకు సన్మానం చేయడం వంటివి సంపత్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు ప్రచారం అయ్యేందుకు కారణం అయింది. ఈ నేపథ్యంలో సంపత్ మీడియాతో మాట్లాడుతూ వాటిపై క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులు ఇప్పటి టీఆర్ ఎస్ ప్రభుత్వం పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కోరుకుంటున్నానని తెలిపారు. తోటి శాసనసభ్యునిగా హరీష్ రావుని గౌరవప్రదంగా కలిశానని..అయితే టీఆర్ ఎస్ ప్రభుత్వం దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. నేను హరీష్ కు దండం పెట్టిన సంగతి చెప్పిన వారు..తాను అడిగిన నియోజకవర్గం పెండింగ్ పనులు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.
``ముమ్మాటికీ నేను హరీష్ రావు కి సన్మానం చేసింది వాస్తవం, కానీ శతకోటి వందనాలు హరీష్ రావుకి అని అన్ని పేపర్లలో వచ్చింది. కాంగ్రెస్ చవటలు దద్దమ్మలు అంటున్న హరీష్ - ఇప్పుడు వారినే తన పక్కన కుర్చోపెట్టుకున్న సంగతి మరిచారు. హరీష్ రావు కి కుడి పక్కన ,ఎడమ పక్కన కూర్చున్న మంత్రులు చవటలు దద్దమ్మలా? అప్పటి మంత్రులు వాళ్లే. ఆర్డీఎస్ పరిరక్షణ నా బాధ్యతగా నా వంతు కృషి చేస్తున్నాను. ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఇప్పుడున్న మంత్రులే నాకు సంఘీభావం తెలిపారు. మంత్రి హరీష్ రావు ఆయన పక్కన ఉన్నటువంటి బడపలు చెప్పిన మాటలు వింటున్నాడు. నేను హరీష్ అన్నా అని గౌరవంగా పిలుస్తే - నన్ను తమ్ముడు అని పిలిశావ్. కానీ ఈ రోజు నీ మీద నమ్మకం పోయింది` అని మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో ప్రభుత్వ కార్యక్రమం టీఆర్ ఎస్ పార్టీ కార్యక్రమం లాగా చేశారని విరుచుకుపడ్డారు.
హరీష్ రావు దిగజారుడు రాజకీయాలు చేయడం మానుకోవాలని సంపత్ కోరారు. హరీష్ రావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే - మాజీ మంత్రి డీకే అరుణ తనకు మాతృసమానురాలని ఆయన తెలిపారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నేను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా అని తప్పుడు ప్రచారం చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. తాను పార్టీ వీడనని తమ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుసునని సంపత్ చెప్పారు. టీఆర్ ఎస్ లోకి రానని మంత్రులు హరీష్ రావు - కేటీఆర్ కు కూడా తెలుసని ఆయన అన్నారు.