ఆ రేంజ్ లో కుదిపేసిన గెలాక్సీ నోట్ 7!

Update: 2016-10-12 16:15 GMT
గెలాక్సీ నోట్ 7 రూపంలో శాంసంగ్ ను వెన్నాడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయిన శాంసంగ్ లిథియం-అయాన్ బ్యాటరీ పేలుడు ఫిర్యాదులు చేయడంతో మొదలైన కష్టాలకు సంబందించిన నష్టాలు తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ విషయంలో శాంసగ్ చేసింది చిన్న తప్పిదమే కావొచ్చు కానీ అది ఆ సంస్థ మనుగడనే ప్రశ్నార్థం చేసిందంటే అది అతిశయోక్తి కాదు. ఎలక్ట్రానిక్స్ గూడ్స్ లో ఇప్పటి వరకు తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తోన్న శాంసంగ్ కు గెలాక్సీ నోట్ 7 కలిగించిన నష్టం దాదాపు లక్ష కోట్లు ఉంటుందట!

గెలాక్సీ నోట్ 7 ఫోన్ పేలుతుంది అన్న ఒక్క వార్త ప్రపంచంలోనే మొబైల్ ఫోన్ తయారీ రంగంలో రారాజుగా ఉన్న ఒక కంపెనీని అతలాకుతలం చేసేసింది. గెలాక్సీ నోట్ 7 పేలుతుంది అనే వార్తలు రావడం.. దానికి కంపెనీ కూడా అంగీకరించటం తెలిసిందే. ఈ సమయంలో ఆ ఫోన్లన్నీ రీప్లేస్ చేస్తున్నామని శాంసంగ్ ప్రకటించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సుమారు 25 లక్షల గెలాక్సీ 7 నోట్ ఫోన్లను రీప్లేస్ చేశారట! అయితే రీప్లేస్ చేసిన ఫోన్ల నుంచి కూడా పొగలు రావటం - పేలిపోవడంతో విమానాల్లో ఈ ఫోన్ ని నిషేధించారు.

ఈ పరిణామాలతో శాంసంగ్ సంస్థ కూడగట్టుకున్న నష్టం నిపుణుల అంచనా ప్రకారం లక్ష కోట్ల రూపాయలు ఉంటుందట. ఈ ఫోన్ రీప్లెస్ ల కారణంగా ఇప్పటికే సంస్థ 10 బిలియన్ డాలర్ల (65వేల కోట్ల రూపాయలు) నష్టం వాటిల్లిందని శాంసంగే స్వయంగా ప్రకటించింది. ఇదే క్రమంలో ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ - సేల్స్ లో మార్కెట్ వాటా తగ్గటం - ఫలితంగా షేర్ వ్యాల్యూ పడిపోవటం ఇలా అన్ని రకాలుగా లెక్కలు వేస్తే మొత్తంగా శాంసంగ్ కు ఈ గెలాక్సీ నోట్ 7 పుణ్యమా అని లక్ష కోట్ల రూపాయల నష్టపోయినట్లు బిజినెస్ వర్గాల్లో చర్చనడుస్తుంది. అయితే, శాంసంగ్ సంస్థ మొత్తం టర్నోవర్ లక్షా 14వేల కోట్ల రూపాయలు కాగా మార్కెట్ విలువ మాత్రం 15 లక్షల కోట్లు.

శాంసంగ్ నష్టాల సంగతి అలా ఉంటే, ఇదే సమయంలో ఐ ఫోన్ 7 రూపంతో పాటు, శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫెయిల్యూర్ రూపంలో కూడా యాపిల్‌ లాభపడనుంది! యాపిల్‌ 7తో రిలయన్స్‌ జియో ఏడాది పాటు ఉచిత సేవలు అందించనుండటంతో యాపిల్‌ అమ్మకాలు అంబరాన్ని అంటే అవకాశం ఉందని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News