నవ రత్నాలు... స్పెషల్ కేర్ - స్పెషల్ ఆఫీసర్

Update: 2019-06-22 14:00 GMT
వైఎస్సార్ కాంగ్రెస పార్టీని అధికారంలోకి తెచ్చిన నవరత్నాలను ఎట్టిపరిస్థితుల్లో పకడ్బంధీగా అమలు చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొద్దిరోజులుగా దీనికి ప్రత్యేక కమిటీని నియమించి రోజాకు ఆ కమిటీని చూసే పదవి అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అయితే, అలాంటి కీలకమైన నిర్ణయమే తీసుకున్నారు గాని రోజాకు అయితే పదవి ఇవ్వలేదు.

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం శామ్యూల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సలహాదారుగా నియమితులు అయ్యారు. ఆయనకు నవరత్నాల అమలు బాధ్యతను కూడా అప్పగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. మూడేళ్ల పాటు ఈ పదవి కొనసాగుతుంది. ఎటువంటి లోపాలు లేకుండా అర్హులందరికీ ఈ పథకం చేరే బాధ్యతను ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తారు. నవరత్నాల కమిటీకి ముఖ్యమంత్రి ఛైర్మన్ కాగా - వైస్ ఛైర్మన్ శామ్యూల్. ఇది కేబినెట్ హోదా.

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన శామ్యూల్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. పదవీ విరమణ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. ప్రతిపక్షంగా ఉన్నపుడు జగన్ కి అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వడమే కాకుండా పాలన విషయంలో ఇపుడు కీలక నిర్ణయాలు వేగంగా తీసుకోవడం వెనుక ఆయన సహకారం ఉంది. అందుకే సలహాదారు పదవి కూడా అప్పగించారు. జగన్ గవర్నమెంటులో డబుల్ ధమాకా కొట్టిన వ్యక్తి ఈయనే.
Tags:    

Similar News