విజయనగరం గజపతి రాజుల పంచాయితీకి ఇప్పట్లో తెరపడేలా లేదు. టీడీపీ సీనియర్ నేత , మాజీ ఎంపీ అశోక్ గజపతి రాజుపై మాన్సాస్ సింహాచలం దేవస్థానం చైర్మన్ సంచయిత ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది.
తాజాగా వివాదానికి మహారాజా కాలేజీ కేంద్రబిందువైంది. ఈ కాలేజీపై అశోక్ గజపతి రాజు చేస్తున్నది తప్పుడు ప్రచారమన్న సంచయిత స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రైవేట్ కాలేజీ అది అని స్పష్టం చేశారు.
మహారాజా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎయిడెడ్ హోదాను 2017లో అశోక్ గజపతి రాజు సరెండర్ చేశారని ఆ పాలసీతోనే ముందుకెళుతున్నామని సంచయిత తెలిపారు.ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయమే కొనసాగుతోందని సంచయిత క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజుపై విమర్శలు గుప్పించారు. మాన్సాస్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు ఉన్నప్పుడు తప్పుడు వివరాలు ఇవ్వడం వల్ల ఆనాడు మాన్సాస్ కాలేజీలకు రూ.6.5 కోట్ల నష్టం వచ్చిందన్నారు.అప్పటి టీడీపీ ప్రభుత్వానికి అశోక్ గజపతి రాజు ఈ డబ్బు ఇచ్చారా అని ఆమె విమర్శించారు.
2018-20లో 170మంది విద్యార్థులకు ఇచ్చిన డిగ్రీలు చెల్లుబాటు కాకుండా సంచయిత.. విద్యార్థుల భవిష్యత్ తో అశోక్ గజపతి రాజు ఆడుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు.