చంద్రబాబు పై చెప్పుల దాడి ..చేసింది అమరావతి రైతులేనా ?

Update: 2019-11-28 07:10 GMT
ఏపీ రాజధాని అమరావతి కేంద్రం గా ప్రస్తుతం రాజకీయ రగడ మొదలైంది. రాష్ట్రం   విడిపోయిన తరువాత అప్పటి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించారు. ఏపీ రాజధాని అమరావతిని మరో సింగపూర్ ని చేస్తా అంటూ అమరావతి ప్రాంతంలోని వేల ఎకరాల రైతుల భూములని తీసుకున్నాడు. ఆ తరువాత అమరావతి లో అభివృద్ధి ఉరకలు పెడుతుంది అంటూ వీలైన కాడికి ప్రపంచం అంతా తిరిగి ఏపీని అప్పుల ఏపీ గా మార్చేశారు. అలాగే వేల కోట్లతో రాజధాని ని నిర్మిస్తున్నాం అని చెప్పినా కూడా ఎక్కడ ఒక్క ప్రభుత్వ శాశ్వతమైన భవనాన్ని కూడా నిర్మించలేదు.

ఇంతలోనే మళ్లీ ఎన్నికలు రావడంతో ..మరోసారి అధికారాన్ని కట్టబెడితే ..అమరావతిని సింగపూర్ చేస్తా , అమెరికా చేస్తా అంటూ ప్రజల మధ్యకి వచ్చారు. కానీ , ఈ సారి బాబు మాటలని ఎవరు అంతగా నమ్మలేదు. దీనితో టీడీపీ చరిత్రలో ఎన్నడూ చూడని ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక ఇప్పుడు మూడు పంటలు పండే విలువైన భూములను రైతుల నుంచి దౌర్జన్యంగా లాగేసుకొని ,  రాజధాని నిర్మించకుండా తమ నాయకులకి అప్పలంగా అప్పగించేశారు అన్న  విమర్శలు వస్తున్నాయి. అమరావతి నా లక్ష్యం అని చెప్పుకొని తిరిగిన బాబు ఈ రోజు అదే అమరావతికి ప్రతిపక్ష నాయకుడి హోదాలో వెళ్లారు. కానీ , ఈ  పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

కొందరు దళిత రైతులు చంద్రబాబు గ్రాఫిక్స్ తో తమను మోసం చేసారని..రాజధానిలో పర్యటించాలంటే ముందుగా క్షమాపణ చెప్పి రావాలని డిమాండ్ చేసారు. అయితే, చంద్రబాబు కొద్ది సేపటి క్రితం రాజధానిలో పర్యటన ప్రారంభించారు. చంద్రబాబును రాకను స్వాగతిస్తూ కొందరూ..వ్యతిరేకిస్తూ మరి కొందరు రెండు వర్గాలుగా చీలి పోయారు. వెంకటాయ పాలెం వద్ద చంద్రబాబుతో పాటుగా ఉన్న టీడీపీ నేతల కాన్వాయ్ మీదకు చెప్పులు..రాళ్లు విసిరే ప్రయత్నం చేసారు. బాబు కాన్వాయ్ వైపు దూసుకెళ్లేందుకు ఓ వర్గం రైతులు ప్రయత్నం చేయడంతో, పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారిని చెదరగొట్టి, కాన్వాయ్ కి దారి కల్పించారు. కానీ ,  చంద్రబాబు గోబ్యాక్‌ అంటూ నల్లజెండాలతో అమరావతి రైతులు నిరసన తెలుపుతున్నారు. మొత్తంగా చంద్రబాబు పై ఈ దాడి వెనుక  అమరావతి రైతుల ఆక్రోశమే కారణం అని తెలుస్తుంది.  అలాగే చంద్రబాబు పై దాడి చేసిన వారిలో వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నట్టు సమాచారం. రాజధాని లో చంద్రబాబు పర్యటన అందరికి ఆసక్తిని రేకెత్తించగా .. .తాజాగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులతో  ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో హాట్  టాపిక్ గా మారింది.
Tags:    

Similar News