మత్తు కేసులో కొత్త నిజాలు.. రష్యా యువతుల కంటే ఇరానీ అమ్మాయిలకే ఓటు!

Update: 2021-04-14 03:52 GMT
సంచలనంగా మారిన బెంగళూరు డ్రగ్స్ కేసుకు సంబంధించి కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి. వారాంతంలోనూ.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసే పార్టీల్లో మత్తు మందు మాత్రమే కాదు.. పెద్ద ఎత్తున విదేశీ యువతుల్ని కూడా తీసుకొచ్చే వారని.. ఆ మాటకు వస్తే.. ఆ పార్టీల్లో వారు కూడా ప్రధాన ఆకర్షణగా భావిస్తున్నారు. ఈ తరహా పార్టీల కోసం బెంగళూరుకు చెందిన డానియేల్ అనే వ్యక్తి కొన్ని దేశాలకు చెందిన యువతుల్ని ప్రత్యేకంగా తీసుకొచ్చే వారని చెబుతున్నారు.

ఈ పార్టీల్లో పాల్గొనే అతిధులకు.. ప్రత్యేక సేవలు అందించేందుకు సిద్ధం చేసే వారని పోలీసుల విచారణలో తేలినట్లు చెబుతున్నారు. డానియేల్ ప్రత్యేకత ఏమంటే.. ఈ పార్టీలకు రష్యా.. ఇరానీ యువతుల్ని ఎక్కువగా తీసుకొచ్చేవారని చెబుతున్నారు. రష్యా యువతులతో పోలిస్తే.. ఇరానీ అమ్మాయిలకే ఎక్కువగా డిమాండ్ ఉండేదని తేలింది. దీంతో.. నగరంలో ఇప్పటికి ఉన్న ఈ తరహా ఇరానీ అమ్మాయిలు ఎవరన్న విషయాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇరానీ వీసాలతో ఇప్పటికి నగరంలో ఉన్న యువతులు ఎవరు? వారేం చేస్తుంటారు? అన్న విషయాన్ని క్రాస్ చెక్ చేసి.. హైటెక్ పార్టీల్లో సేవలు అందించే వారైతే.. వారిని విచారించాలని భావిస్తున్నారు. ఎందుకంటే.. ఈ పార్టీలకుసంబంధించిన సమాచారం వారి వద్ద ఎక్కువగా ఉండటంతో పాటు.. వారిని విచారిస్తే.. మరిన్ని కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. హైదరాబాద్ శివారులోనూ ఈ తరహాలోనే పార్టీలు జరిగేవని.. వాటికి సంబంధించిన వివరాల్ని సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Tags:    

Similar News