ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయి.. ఆపై బెయిల్ పొందిన సత్తుపల్లి టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఒకే రోజు రెండు ఉపశమనాలు లభించాయి. గోదావరి పుష్కరాలు మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఆయన రిలీఫ్ లభించింది.
ప్రస్తుతం పరిమితులతో కూడిన బెయిల్ మీద బయట ఉన్న సండ్ర.. పుష్కరాల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. అదే సమయంలో టీటీడీ బోర్డు మెంబర్ అయిన ఆయన.. ఆ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు.. సండ్ర వినతులపై సానుకూలంగా స్పందించింది. సండ్ర పిటీషన్ పై ఏసీబీ అధికారులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవటం.. ఆయన గోదావరి పుష్కరాలకు వెళతానంటే.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. పుష్కర స్నానాలకు వెళ్లొచ్చని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
అదే సమయంలో టీటీడీ బోర్డు సమావేశాల్లో పాల్గొనేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చని.. ఎలాంటి అభ్యంతరాలు లేవని పేర్కొంది. దీంతో ఏసీబీ కోర్టు సండ్ర వినుతలుపై సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో సండ్ర కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలగనుంది.