తాజాగా.. సండ్ర మ‌ళ్లీ లేఖ రాశారు

Update: 2015-07-01 12:33 GMT
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ ఎదుట హాజ‌రుకావాలంటూ తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య‌కు నోటీసులు ఇవ్వ‌టం ఆయ‌న‌.. అనారోగ్యం కార‌ణంగా హాజ‌రు కాలేనంటూ లేఖ రాయ‌టం తెలిసిందే.
త‌న లేఖ‌లో కోరిన ప‌ది రోజుల గ‌డువు తీరిన‌ప్ప‌టికీ ఆయ‌న ఎక్క‌డున్న విష‌యం ఇప్ప‌టికి బ‌య‌ట‌కు రాలేదు. త‌న‌కు విప‌రీత‌మైన వెన్నునొప్పి కార‌ణంగా.. వైద్యుల స‌ల‌హా మేర‌కు ఆసుప్ర‌తిలో చికిత్స పొందుతున్న‌ట్లు పేర్కొన్న ఆయ‌న‌.. ప‌ది రోజుల త‌ర్వాత తాను విచార‌ణ‌కు హాజ‌రు అవుతాన‌ని పేర్కొన్నారు.

ఆ త‌ర్వాత‌.. గ‌డువు ముగిసిన‌ప్ప‌టికీ ఆయ‌న విచార‌ణ‌కు హాజ‌రు కాలేదు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ఏసీబీ మ‌రోసారి సండ్ర‌కు నోటీసులు ఇవ్వాల‌న్న ఉద్దేశ్యంలో ఉన్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే. ఏసీబీ నుంచి ఎలాంటి నోటీసులు జారీ కాలేదు. ఈ నేప‌థ్యంలో సండ్ర నుంచి మ‌రో లేఖ తెలంగాణ ఏసీబీకి పంపారు.

తాజా లేఖ‌లో ఆయ‌న త‌న ఆరోగ్యం గురించి వివ‌రించి.. ఏసీబీ అధికారులు ఎప్పుడు హాజ‌రు కావాల‌ని చెబితే.. అప్పుడు హాజ‌రు అవుతాన‌ని పేర్కొన‌టం గ‌మ‌నార్హం. తాను రాజ‌మండ్రి బొల్లినేని ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్లు పేర్కొన్నారు. విచార‌ణ‌కు తాను సిద్ధ‌మ‌ని.. ఎప్పుడు ర‌మ్మంటే అప్పుడు విచార‌ణ‌కు వ‌స్తాన‌ని సండ్ర పేర్కొన్న నేప‌థ్యంలో ఏసీబీ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News