సత్తుపల్లి టీడీపీ అభ్యర్థిగా గెలిచి తెలంగాణలో రికార్టు సృష్టించారు సండ్ర వెంకట వీరయ్య. ఇంత కేసీఆర్ వేవ్‌లో కూడా.. సండ్ర సత్తుపల్లి నుంచి గెలవడం అందర్ని ఆశ్చర్యపర్చింది. సండ్ర అదే నియోజకవర్గం నుంచి గెలవడం ఇది రెండోసారి. దీంతో.. తెలంగాణలో బలమైన అభ్యర్థులు టీఅర్‌ఎస్‌లోనే ఉండాలనే బలమైన భావన ఉన్న కేసీఆర్.. సండ్రని తన పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటివరకు అయితే.. అధికారికంగా ఏమీ రాలేదు కానీ.. సండ్ర మాత్రం కారెక్కడం ఫిక్స్ అని కొంతమంది చెప్తున్న మాట. ఈ మాటలకు బలం చేకూరుస్తున్నట్లుగా సండ్ర కూడా ఎన్టీఆర్ నివాళి కార్యక్రమానికి డుమ్మా కొట్టారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యేముందు ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించి నివాళులు అర్పించడం నేతల ఆనవాయితి. ఈ సందర్భంగా ఇవాళ ఎన్టీఆర్ ఘాట్ కు టీడీపీ నేతలు ఎల్.రమణ - రావుల వచ్చారు. అసెంబ్లీకి వెళ్లాల్సిన సండ్ర మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో సండ్ర కారెక్కడం కన్ ఫర్మ్ అని వార్తలు విన్పిస్తున్నాయి. అయితే ఈ పుకార్లపై సండ్ర వెంకట వీరయ్య స్పందించారు. పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉన్నానంటూ చెప్పారు సండ్ర. అయితే.. ఆయన ఎన్ని చెప్పినా కానీ.. కారెక్కడం మాత్రం కన్ ఫర్మ్ అని.. అందుకే మీడియాకు కన్పించకుండా తిరుగుతున్నారని వాదన విన్పిస్తోంది.