ఆ ఇద్ద‌రు వ‌ద్దు...సింధునే ముద్దు

Update: 2016-08-19 13:16 GMT
రియో ఒలింపిక్స్ - 2016లో ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పీవీ.సింధు ఫైనల్ చేరుకుంది. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల యాభై అయిదు నిమిషాలకు యావ‌త్ ఇండియ‌న్స్ అంద‌రూ టీవీల‌కు అతుక్కుపోనున్నారు. సింధూ ఫైన‌ల్లో గెలిచి స్వ‌ర్ణం తేవాల‌ని యావ‌త్ భార‌త‌దేశం మొత్తం పూజ‌లు చేస్తోంది. ఇక సింధు తెలుగ‌మ్మాయి కావ‌డంతో రెండు తెలుగు స్టేట‌లలో ఎంతోమంది సింధు గెలుపుకోరుతూ పూజ‌లు - ప్రార్థ‌న‌లు కూడా చేస్తున్నారు.

 అయితే సింధు ఫైన‌ల్‌ కు చేరిన నేప‌థ్యంలో మ‌న రెండు తెలుగు స్టేట్‌ ల క్రీడాభిమానులు మ‌రో ఇద్ద‌రు క్రీడాకారిణిల‌ను టార్గెట్‌గా చేసుకుని వాళ్ల‌ను ఆటాడేసుకుంటూ సింధూను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అందులో ఒకరు సైనా నెహ్వాల్. మరొకరు సానియా మీర్జా. ప‌లువురు క్రీడాకారిణులు సోష‌ల్ మీడియాలో సైనా బ్యాగ్ సర్దుకొని ఇంటికి వ‌చ్చేయాల‌ని ట్వీట్ చేయ‌గా...అందుకు సైనా కూడా హుందాగానే రిప్లే ఇచ్చింది. సింధు ప‌త‌కం సాధించాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్టు చెప్పింది. సైనా ఇచ్చిన షాకింగ్ రిప్లేతో స‌ద‌రు అభిమాని ప‌శ్చాత్తాపం కూడా వ్య‌క్తం చేశాడు.

 ఇక ఆట‌తో కంటే అందంతోనే ఆక‌ర్షిస్తుంద‌ని విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న తెలంగాణ బ్రాండ్ అంబాసిడ‌ర్ సానియామీర్జాను కూడా కొంద‌రు నెటిజ‌న్లు టార్గెట్‌ గా చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌ గా సానియా మీర్జా స్థానంలో మన సంస్కృతి - సంప్రదాయాలను గౌరవించే పీవీ సింధుని ఎంపిక చేయాలని పోస్టింగ్‌ లు పెడుతున్నారు.

 ఇక సింధూ రియో ఒలింపిక్స్‌-2016లో స్వ‌ర్ణం సాధించాలంటూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతిలో పలువురు విద్యార్థులు సింధూ స్వ‌ర్ణం గెల‌వాల‌ని కోరుతూ వంద కొబ్బ‌రికాయ‌లు కొట్టారు. చాలా చోట్ల బ్యాన‌ర్లు ప‌ట్టుకుని వీథుల్లో ర్యాలీలు చేస్తున్నారు. హైదరాబాదులోను పలు ఆలయాలలో క్రీడాభిమానులు పూజలు చేస్తున్నారు. సౌత్‌లోనే కాదు నార్త్‌ లో ఢిల్లీ - వార‌ణాసిలలో కూడా సింధు గెలవాలని ప్ర‌త్యేక‌ పూజ‌లు చేస్తున్నారు. తెలుగు స్టేట్‌ ల‌లో అయితే ఈ కోలాహ‌లం ఎక్కువ‌గా ఉంది. 6 గంట‌ల‌కు అంద‌రూ టీవీల‌కు అతుక్కుపోనున్నారు.
Tags:    

Similar News